
సినిమా
ఇంటర్నెట్ డెస్క్: బాలీవుడ్ ప్రముఖ నటులు అమితాబ్ బచ్చన్, అజయ్ దేవ్‌గణ్ కలిసి నటిస్తున్న సినిమా టైటిల్ మారింది. సామాజిక మాధ్యమాల వేదికగా చిత్ర బృందం కొత్త పేరును ప్రకటిస్తూ నాయకానాయికల ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. ఈ క్రేజీ మల్టీస్టారర్‌కు ‘మేడే’ అనే టైటిల్‌కి బదులుగా ‘రన్‌వే 34’ అనే పేరు ఖరారైంది. పోస్టర్లను చూస్తుంటే పైలెట్ జీవితాలకు సంబంధించిన కథలా అనిపిస్తుంది. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని అజయ్ దేవ్‌గణ్ తెరకెక్కిస్తున్నారు. రకుల్‌ప్రీత్ సింగ్ కథానాయిక. ఆకాంక్ష సింగ్, బొమన్ ఇరానీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏడీఎఫ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం 2022 ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకురానుంది. అజయ్ దేవ్‌గణ్‌కి దర్శకత్వం కొత్తేం కాదు. గతంలో ‘యు మీ ఔర్ హమ్’, ‘శివాయ్’ చిత్రాలకు డైరెక్షన్ చేసిన సంగతి తెలిసిందే.
► Read latest Cinema News and Telugu News