తాజా వార్తలు

Facebook Share Twitter Share Comments Telegram Share
Covid-19: సాయుధ బలగాల్లో 70వేల మందికి కరోనా..!

ఇప్పటివరకు 190 మంది మరణించారన్న కేంద్ర ప్రభుత్వం

దిల్లీ: కొవిడ్‌-19 మహమ్మారితో వణికిపోయిన భారత్‌లో ప్రస్తుతం పరిస్థితులు అదుపులోనే ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటికే 3 కోట్ల 40లక్షల మంది వైరస్‌ బారినపడి కోలుకున్నారు. ఇదే సమయంలో సాయుధ బలగాల్లోనే 70 వేల మంది సిబ్బందికి వైరస్‌ సోకినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. వీరిలో ఇప్పటివరకు 190 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. సాయుధ బలగాల్లో కొవిడ్‌ కేసులపై రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు రక్షణశాఖ సహాయమంత్రి అజయ్‌ భట్‌ ఈ సమాధానమిచ్చారు.

దేశంలో వైరస్‌ వెలుగు చూసినప్పటి నుంచి ఇప్పటివరకు సాయుధ బలగాల్లో మొత్తం 70 వేల మందికి వైరస్‌ సోకగా.. ఇండియన్‌ ఆర్మీలో అత్యధికంగా 45,576 మంది సైనికులు వైరస్‌ బారినపడ్డారు. ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌లో 14,022 సిబ్బంది, ఇండియన్‌ నేవీలో 7,747 మందికి వైరస్‌ సోకినట్లు కేంద్ర రక్షణశాఖ సహాయమంత్రి వెల్లడించారు. వైరస్‌ సోకిన మొత్తం సాయుధ బలగాల్లో ఇప్పటివరకు 190 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొన్నారు. వీరిలో ఇండియన్‌ ఆర్మీలోనే 137 మంది చనిపోగా, ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌లో 49 మంది, ఇండియన్‌ నేవీలో నలుగురు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.

అయితే, విధుల్లో ఉన్న సమయంలో ఎవరైనా ఇన్‌ఫెక్షన్‌ సోకి ప్రాణాలు కోల్పోయినట్లయితే ఇప్పటివరకు ఉన్న నిబంధనల ప్రకారం వారికి ప్రత్యేకంగా ఎటువంటి పరిహారం లభించే అవకాశం లేదని కేంద్ర రక్షణశాఖ వెల్లడించింది. అయినప్పటికీ విధుల్లో ఉన్న సమయంలో మరణానంతరం సాధారణంగా వచ్చే ప్రయోజనాలను మాత్రం పొందుతారని తెలిపింది. వీటికి అదనంగా జాతీయ విపత్తు నిర్వహణ సాధికార సంస్థ (NDMA) మార్గదర్శకాల ప్రకారం రూ.50వేల కొవిడ్‌ పరిహారం అందుతుందని పేర్కొంది.


మరిన్ని

దేవ‌తార్చ‌న

+

© 1999- 2022 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.