
తాజా వార్తలు
1. యాసంగి ధాన్యం కొనం: సీఎం కేసీఆర్
యాసంగిలో ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇక ఉండబోవని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కేబినెట్ భేటీ అనంతరం ధాన్యం సేకరణపై సీఎం కేసీఆర్ మాట్లాడారు. ‘‘ధాన్యం పండించి రైతులు నష్టపోవద్దని మేం ధైర్యంగా చెబుతున్నాం. యాసంగి పంటకు కొనుగోలు కేంద్రాలు ఉండవు. సొంతంగా అమ్ముకునే రైతులు యాసంగిలో వరి వేసుకోవచ్చు. కేంద్రం తీసుకునే పరిస్థితి లేనందునే వరి వేయుద్దని చెబుతున్నాం. మొత్తం ధాన్యం సేకరణ, నిల్వశక్తి రాష్ట్రానికి లేదు. యాసంగికి రైతుబంధు యథాతథంగా ఇస్తాం’’ అని చెప్పారు.
2. విదేశీ ప్రయాణికులకు ఆర్టీ-పీసీఆర్ తప్పనిసరి: ఆళ్ల నాని
విదేశాల నుంచి ఏపీకి వచ్చే వారికి ఆర్టీ-పీసీఆర్ పరీక్ష తప్పనిసరి అని.. ఈ పరీక్షలో పాజిటివ్ వస్తే క్వారంటైన్‌కు పంపిస్తామని ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. కొవిడ్‌పై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. సమీక్ష అనంతరం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని వివరాలను మీడియాకు వెల్లడించారు. వచ్చే చ్చే ఏడాది జనవరి 15నాటికి రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తవ్వాలని సీఎం ఆదేశించినట్లు వెల్లడించారు.
3. విద్యార్థుల తల్లిదండ్రులు భయపడాల్సిన పనిలేదు: మంత్రి సబిత
విద్యార్థులందరికీ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని పలు విద్యా సంస్థల్లో కొవిడ్ కేసులు వెలుగుచూడటంతో మంత్రి సబిత విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భయపడాల్సిన పనిలేదన్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యార్థులు తప్పనిసరిగా మాస్కులు ధరించి, జాగ్రత్తలు పాటించేలా చూడాలని పాఠశాలల యాజమాన్యాలను మంత్రి ఆదేశించారు.
4. బ్యాంకుల్లో నిధులు దాచొద్దు.. ప్రభుత్వ శాఖలకు ఉత్తర్వుల జారీ
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ సంబంధిత సంస్థలు తమ వద్ద ఉన్న ప్రజాధనాన్ని ఏ ఇతర బ్యాంకుల్లోనూ డిపాజిట్ చేయడానికి వీల్లేదని ప్రభుత్వం తేల్చిచెప్పింది. కంపెనీ చట్టం కింద ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ సర్వీసు కార్పొరేషన్లోనే ఆ మొత్తాన్ని డిపాజిట్ చేయాలని స్పష్టం చేసింది. ప్రజాధనం రక్షణకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు.
5. రిలయన్స్ క్యాపిటల్ బోర్డు రద్దు.. ఆర్బీఐ కీలక నిర్ణయం!
ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీ ప్రమోటర్‌గా ఉన్న రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్(ఆర్సీఎల్)పై దివాలా పరిష్కార స్మృతి (ఐబీసీ- ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్సీ కోడ్)ని ప్రయోగించేందుకు ఆర్బీఐ సిద్ధమైంది. అందులో భాగంగా నేడు కంపెనీ బోర్డును రద్దు చేసింది. ఆ స్థానంలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నాగేశ్వర్ రావును అడ్మినిస్ట్రేటర్‌గా నియమించింది. త్వరలో ఐబీసీ పరిష్కార ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు ఆర్బీఐ తెలిపింది.
6. Omicron: బోట్స్వానా నుంచి వచ్చిన మహిళ కోసం వేట
కరోనా కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తూ గుబులు రేపుతోంది. ఈ వేరియంట్ మొదట దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే దక్షిణాఫ్రికాలోని బోట్స్వానా నుంచి భారత్‌కు వచ్చిన ఓ మహిళను పట్టుకునే ప్రయత్నంలో పడ్డారు అధికారులు. ఈ నెల 18న ఆమె మధ్యప్రదేశ్‌లోని జబల్‌పుర్‌కు వచ్చినట్లు జబల్పుర్ వైద్యాధికారి డా.రత్నేష్ కురారియా తెలిపారు.
7. కొత్త వేరియంట్‌తో ఒక్క మరణం కూడా లేదు..కానీ!: WHO
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌తో ప్రపంచానికి తీవ్ర ముప్పు పొంచి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ సోమవారం హెచ్చరించింది. అయితే ఈ వేరియంట్ ఏ స్థాయిలో వ్యాప్తి చెందుతుందో, తీవ్రత ఏ మేరకు ఉంటుందో అనే దానిపై మాత్రం అనిశ్చితి నెలకొని ఉందని వెల్లడించింది. ఈ కొత్త రకం వెలుగుచూసిన కొద్ది రోజుల్లోనే వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది.
8. Mehul Choksi: మళ్లీ కిడ్నాప్ చేస్తారేమో..!
మరోసారి తాను కిడ్నాప్‌నకు గురవుతానేమోనని పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడు మెహుల్ చోక్సీ ఆందోళన చెందుతున్నట్లు ఓ ఆంగ్ల వార్త సంస్థ పేర్కొంది. ఈ నెల మొదట్లో చోక్సీ బాంబే హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. తాను ప్రయాణాలు చేయలేనని.. పరారీలో ఉన్న నేరగాడి కోసం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అమలు చేసే ప్రొసీడింగ్స్‌ను నిలిపివేయాలని కోరిన విషయం తెలిసిందే.
9. డెల్టాతో పోలిస్తే ఆరు రెట్లు వేగంగా ఒమిక్రాన్!
ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న ఒమిక్రాన్ వేరియంట్.. డెల్టాతో పోలిస్తే ఆరురెట్లు వేగంగా వ్యాప్తి చెందుతోందని ఆరోగ్యరంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. డెల్టాతో పోల్చితే కొత్త వేరియంట్ ఆర్‌వాల్యూ ఎక్కువంటున్న నిపుణులు.. మోనోక్లోనల్ యాంటీబాడీ థెరపీ, కాక్ టెయిల్ చికిత్సలకు సైతం లొంగడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డెల్టా వేరియంట్‌తో పోలిస్తే ఒమిక్రాన్ ఆరు రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతోందని పేర్కొన్నారు.
10. IND vs NZ: తొలి టెస్టు డ్రా
కాన్పూర్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన తొలి టెస్టు టెస్టు డ్రాగా ముగిసింది. చివరి రోజు ఆఖరి సెషన్లో గొప్పగా పుంజుకున్న భారత బౌలర్లు.. ఐదు వికెట్లు పడగొట్టారు. మరో వికెట్ తీసి ఉంటే భారత్ ఘన విజయం సాధించేదే! అయితే, కివీస్ టెయిలెండర్లు అజాజ్ పటేల్ (2: 23 బంతుల్లో) రచిన్ రవీంద్ర (18: 91 బంతుల్లో 2 ఫోర్లు) జాగ్రత్తగా ఆడుతూ టీమ్ఇండియా విజయాన్ని అడ్డుకున్నారు.
మరిన్ని
Rakesh Tikait: సాగుచట్టాల రద్దు ఓకే.. ఇక ఇతర సమస్యలపై ఉద్యమిస్తాం!
Rahul Gandhi: ‘చర్చలకు అనుమతి ఇవ్వకుంటే పార్లమెంట్ ప్రయోజనం ఏంటి?’
Karnataka: హామీ పత్రం ఇస్తేనే టీకా వేసుకుంటా.. కర్ణాటకవాసి వినూత్న డిమాండ్
TS corona update: తెలంగాణలో కొత్తగా 184 కరోనా కేసులు.. ఒకరి మృతి
Omicron: ఇప్పటివరకు.. ఒమిక్రాన్ వేరియంట్ దాఖలాలు భారత్‌లో లేవ్!
Shashi Tharoor: మహిళా ఎంపీలతో సెల్ఫీ.. వివాదాస్పదమైన శశిథరూర్ కామెంట్స్!
Sivasankar: ముగిసిన శివశంకర్ మాస్టర్ అంత్యక్రియలు.. పాడె మోసిన యాంకర్ ఓంకార్
Covaxin: విదేశాలకు ‘కొవాగ్జిన్’ ఎగుమతులు ప్రారంభించిన భారత్ బయోటెక్
sirivennela: ‘సిరివెన్నెల’ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ విడుదల
Omicron: ఒమిక్రాన్ కలకలం.. బోట్స్వానా నుంచి వచ్చిన మహిళ కోసం వేట
Ap corona update: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 101 కొవిడ్ కేసులు
Mysuru: ఆస్తి కోసం మానవత్వం మరిచి.. మృతదేహం నుంచి వేలిముద్రల సేకరణ
Motorola G31: మాల్వేర్ ప్రొటెక్షన్ ఫీచర్‌తో మోటో కొత్త ఫోన్!
AP News: బ్యాంకుల్లో నిధులు దాచొద్దు.. ప్రభుత్వ శాఖలకు ఉత్తర్వుల జారీ
Bigg Boss Telugu 5: ఫ్రెండ్స్ అయితే నామినేట్ చేయవా?ఏది అనాలనుకున్నా ఆలోచించి అను..!
IND vs NZ:తొలి టెస్టు డ్రా.. విజయానికి వికెట్ దూరంలో నిలిచిపోయిన భారత్!
Omicron variant: స్కాట్లాండ్లో ఆరుగురిలో ‘ఒమిక్రాన్’ గుర్తింపు
Taiwan: సైనికాధికారులతో జిన్‌పింగ్ భేటీ.. తైవాన్‌పైకి యుద్ధవిమానాలు..!
Supreme Court: కృష్ణా ట్రైబ్యునల్ అంశం.. పిటిషన్లపై 13 నుంచి సుప్రీంలో విచారణ
IND vs NZ: ఆరు వికెట్ల దూరంలో టీమ్ఇండియా.. డ్రా దిశగా కాన్పూర్ టెస్ట్
Corona: కరోనా క్లస్టర్‌గా థానె వృద్ధాశ్రమం.. 67 మందికి పాజిటివ్
Dollar Seshadri: శ్రీవారి సేవలపై శేషాద్రి అవగాహన అనన్య సామాన్యం: సీజేఐ
IND vs NZ: తొలి సెషన్ న్యూజిలాండ్‌దే.. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయిన భారత్
December Smartphones: అదిరే ఫీచర్లతో కొత్త ఫోన్లు వచ్చేస్తున్నాయ్!
Winter session: పార్లమెంటు సమావేశాలు.. అలా ప్రారంభమై.. ఇలా వాయిదా
Modi: అన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది
Dollar Seshadri: పదవులతో నిమిత్తం లేకుండా తితిదేకి సేవలందించారు: వెంకయ్య
CJI: మధుమేహ వైద్యానికి రాయితీలివ్వాలి: సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ
Dollar Seshadri: ప్రముఖులు తిరుమల వస్తే డాలర్ శేషాద్రి ఉండాల్సిందే..
IND vs NZ: అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే గెలుస్తాం: కివీస్ కోచ్ రాంచీ
Crime News: అలారం మోగినా వినిపిస్తేనా.. చోరీకి పాల్పడుతూ చిక్కిన వ్యక్తి
Viral: విమానం ల్యాండింగ్ గేర్‌లో దాక్కుని 1600 కిలోమీటర్ల ప్రయాణం!
Rahane: ఆ నిర్ణయం తీసుకునేందుకు ద్రవిడ్, కోహ్లీ మొగ్గు చూపరేమో! : లక్ష్మణ్
UPTET: వాట్సాప్ గ్రూపుల్లో ప్రశ్నాపత్రం.. ఉత్తర్‌ప్రదేశ్ టెట్ రద్దు
Twitter: ట్వీట్లతో ఇబ్బంది పెడుతున్నారా.. వారికిలా చెక్ చెప్పేయండి!
Bigg Boss telugu 5: యాంకర్ రవి ఎలిమినేట్.. కాజల్‌ను సన్నీ సేవ్ చేయడానికి కారణమదే!
sivasankar: ‘సెట్లో డ్యాన్స్ చేస్తూ చచ్చిపోవాలనేదే నా కోరిక’
Omicron variant: కొత్త వేరియంట్‌పై ఆందోళన.. వారిపై నిఘా పెంచండి!
Shreyas - Dravid : రాహుల్ సర్ నాకు చెప్పింది అదే: శ్రేయస్ అయ్యర్
Sivasankar: ‘మగధీర’ పాటకు 22 రోజులు.. ‘అరుంధతి’ పాటకు 32 రోజులు!
Sivasankar: శివశంకర్ని కలవడం అదే చివరిసారి అవుతుందనుకోలేదు: చిరంజీవి
punjab elections: సవాళ్లు విసురుకుంటున్న ఆప్.. కాంగ్రెస్ పార్టీలు!
New Variant: ఒమిక్రాన్‌లో 30కిపైగా మ్యుటేషన్లు.. ప్రమాదకరమే!
Shreyas Iyer: శ్రేయస్ అరుదైన ఫీట్.. తొలి భారతీయ క్రికెటర్‌గా రికార్డు
Social Look: అమెరికాలో ‘లైగర్’ గ్యాంగ్.. అదాశర్మ ఫొటో తీస్తే!
AP News: ఏపీలో ఉద్యోగ సంఘాల పోరుబాట.. కార్యాచరణ ప్రకటించిన నేతలు
Samantha: చిరుగులు.. పిన్నీసుల డ్రెస్! సామ్ కొత్త ఫొటోలు వైరల్
త్రిపుర స్థానిక ఎన్నికల్లో భాజపా క్లీన్‌స్వీప్... తృణమూల్, సీపీఎంకు గట్టి దెబ్బ!
Covid: చైనాకు హెచ్చరిక.. సరిహద్దులు తెరిస్తే రోజుకు 6లక్షల కేసులు!
Gautam Gambhir: గౌతమ్ గంభీర్‌కు బెదిరింపులు.. వారంలో మూడోసారి!
Bandla Ganesh: నటుడు బండ్ల గణేశ్ ఉదారత.. ప్రశంసలు కురిపిస్తోన్న నెటిజన్లు!
Accident: అంత్యక్రియలకు వెళ్తుండగా ఘోర ప్రమాదం.. 18 మంది మృతి
TS News: ధాన్యం కొనుగోళ్లపై కేంద్రాన్ని ప్రశ్నించాలి: కేసీఆర్