
ఫీచర్ పేజీలు
సబ్బాతు పండుగ రోజున యేసు శిష్యులు నడుస్తున్నారు. ఆకలేయడంతో దారిలో కొన్ని ధాన్యపు కంకులు కోశారు. అది చూసి మత పెద్దలైన పరిసయ్యులు విమర్శించారు. కానీ యేసు తన శిష్యులను సమర్థిస్తూ ‘అవసరంలో ధర్మశాస్త్ర విధులను ఉల్లఘించడం తప్పు కాదు. సంప్రదాయం కంటే జీవితం ముఖ్యం. సబ్బాతు కంటే మనిషే ముఖ్యం’ అన్నాడు.
యేసు అలా చెప్పడానికి కారణముంది. అదే సబ్బాతు రోజున ఊచ చెయ్యిగల వ్యక్తిని బాగుచేసినందుకు ఆయన్ను తప్పు పట్టారు. నాటి సమాజంలో విశ్రాంతి దినమైన సబ్బాతురోజున ఏ పనీ చేయకూడదనేది నిబంధన. అయితే ప్రభువు దాన్ని వ్యతిరేకిస్తూ ‘సబ్బాతు విశ్రాంతి దినమైనప్పటికీ ఆ రోజు మంచి పనులు చేస్తే అభ్యంతరం చెప్పనవసరం లేదు. ఒక వ్యక్తి అవస్థపడుతుంటే విశ్రాంతి దినం అని వదిలేయకుండా ప్రాణం కాపాడాలి కదా’ అంటూ వివరించాడు. ధర్మశాస్త్రానికి, పాత నిబంధనకు పరిపూర్ణ అర్థం ఇవ్వడానికే వచ్చానని, వాటిని రద్దు చేయడానికి కాదన్నాడు. పశ్చాత్తాపంతో కలిగే పరివర్తనతోనే దేవుని రాజ్యంలోకి ప్రవేశం కలుగుతుందన్నాడు.
- ఎం.శ్రీవంశీ