Latest Telugu News | Breaking News Telugu | Telugu News Today | News in Telugu

క్రీడలు

Facebook Share Twitter Share Comments Telegram Share
భారత్‌-ఎ 198/5

బ్లోమ్‌ఫోంటీన్‌: దక్షిణాఫ్రికా-ఎతో అనధికారిక రెండో టెస్టులో ఆధిక్యం సంపాదించేందుకు భారత్‌-ఎ పోరాడుతోంది. బుధవారం మ్యాచ్‌ రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. ఇంకా 99 పరుగులు వెనకబడి ఉంది. క్రీజులో హనుమ విహారి (45 బ్యాటింగ్‌), సర్ఫరాజ్‌ ఖాన్‌ (30 బ్యాటింగ్‌) ఉన్నారు. ఒక దశలో 76/4తో కష్టాల్లో ఉన్న జట్టును ఇషాన్‌ కిషన్‌ (49)తో కలిసి విహారి ఆదుకున్నాడు. ఓపెనర్‌ పృథ్వీ షా (42) రాణించాడు కానీ ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. అంతకుముందు ఉదయం ఓవర్‌నైట్‌ స్కోరు 233/7తో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన దక్షిణాఫ్రికా 297 పరుగులకు ఆలౌటైంది. నవ్‌దీప్‌ సైని (3/67), ఇషాన్‌ పోరెల్‌ (3/49) ప్రత్యర్థి జట్టును కట్టడి చేశారు.


మరిన్ని

+

© 1999- 2022 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.