
తెలంగాణ
మొక్కజొన్నకు పెద్దపీట
తర్వాతి స్థానాల్లో శనగ, వేరుశనగ
ఈనాడు, హైదరాబాద్: గతేడాది మొక్కజొన్న సాగు చేయవద్దని చెప్పిన ప్రభుత్వం ఈ యాసంగిలో మళ్లీ అదే సాధారణంకన్నా ఎక్కువగా వేయాలని ప్రణాళిక సిద్ధం చేసింది. వరి సాగు వద్దంటున్న సర్కారు.. దానికి బదులుగా వేయాల్సిన ప్రత్యామ్నాయ పంటల సాగు విస్తీర్ణం లక్ష్యాలను ఖరారు చేసింది. మొత్తం 45 లక్షల ఎకరాల్లో సాధారణ, మరో 10.06 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగుచేయాలని సూచించింది. వీటిలో అత్యధికంగా మొక్కజొన్న 12 లక్షలు, వేరుసెనగ, శనగ 10 లక్షల ఎకరాల చొప్పున ఉన్నాయి. వీటి సాగును ప్రోత్సహించాలని ఇందుకోసం రైతులను చైతన్యపరచాలని వ్యవసాయశాఖకు సూచించింది.
పెరుగుతున్న యాసంగి వరిసాగు
ప్రభుత్వం వద్దని చెబుతున్నా.. రాష్ట్రంలో ప్రస్తుత యాసంగి(రబీ) సీజన్లో వరి సాగు విస్తీర్ణం క్రమంగా పెరుగుతోంది. బుధవారానికి 1,076 ఎకరాల్లో నాట్లు వేశారని.. గతేడాది ఇదే సమయానికి 256 ఎకరాల్లోనే సాగైనట్లు వ్యవసాయ శాఖ బుధవారం ప్రభుత్వానికిచ్చిన నివేదికలో తెలిపింది.