
గ్రేటర్ హైదరాబాద్
కవాడిగూడ, న్యూస్‌టుడే: సీపీఎం తెలంగాణ రాష్ట్ర మూడో మహాసభలు 2022 జనవరి 22 నుంచి 25 వరకు రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్‌లో నిర్వహించనున్నట్లు పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. బుధవారమిక్కడ మహాసభల లోగోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపై పోరాటాలను ఖరారు చేస్తామని చెప్పారు.