
తెలంగాణ
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 193 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 6,76,187కు పెరిగింది. కరోనాతో ఒకరు కన్నుమూశారు. మహమ్మారితో ఇప్పటి వరకు 3,993 మంది మృతిచెందారు. తాజాగా 153 మంది కరోనాకు చికిత్స పొంది ఆరోగ్యవంతులు కాగా.. మొత్తం 6,68,564 మంది కోలుకున్నారు. ఈ నెల 1న సాయంత్రం 5.30 గంటల వరకు నమోదైన కొవిడ్ సమాచారాన్ని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ జి.శ్రీనివాసరావు బుధవారం వెల్లడించారు. తాజా ఫలితాల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 73, రంగారెడ్డి జిల్లాలో 17, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 14 చొప్పున పాజిటివ్‌లు నిర్ధారణ అయ్యాయి.