
తెలంగాణ
ఈనాడు, హైదరాబాద్: జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ వాన్‌పిక్ ప్రాజెక్టు, నిమ్మగడ్డ ప్రసాద్, మాజీ ఐఆర్ఏఎస్ కె.వి.బ్రహ్మానందరెడ్డిలు దాఖలు చేసిన పిటిషన్లపై బుధవారం వాదనలు ముగిశాయి. ఇరుపక్షాల వాదనలను విన్న జస్టిస్ ఉజ్జల్ భూయాన్ తీర్పు వాయిదా వేశారు. సీబీఐ నమోదు చేసిన కేసులో ఎవరు మోసం చేశారో చెప్పలేదని నిమ్మగడ్డ తరఫు సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి తన వాదనల్లో పేర్కొన్నారు.