
గ్రేటర్ హైదరాబాద్
ఈనాడు, దిల్లీ: ఓటుకు నోటు కేసులో గతంలో ఇచ్చిన స్టేను సుప్రీంకోర్టు పొడిగించింది. కేసు నుంచి తన పేరు తొలగించాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, కేసును విచారించే అధికారం అవినీతి నిరోధక శాఖ కోర్టుకు లేదంటూ రేవంత్‌రెడ్డి గతంలో హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లను హైకోర్టు కొట్టివేయడంతో వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు గత ఆగస్టులో స్టే విధించింది. జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ అనిరుధ్ బోస్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం బుధవారం ఈ కేసును విచారించింది. తాము తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు గతంలో విడుదల చేసిన ఉత్తర్వులు అమలవుతాయని ధర్మాసనం పేర్కొంది. కేసు తదుపరి విచారణను జనవరి 27కు వాయిదా వేసింది.