
తెలంగాణ
ఈనాడు- అమరావతి: ‘చట్టబద్ధంగా రావాల్సిన కూలీ ఇవ్వాలని, మేం దాచుకున్న రూ.1,600 కోట్లు జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ డబ్బులు ఇవ్వాలని అడుగుతున్నాం. ఉద్యోగులారా మేం చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసి అలసిపోయాం. అవి విఫలమయ్యాయి. ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ నెల 7 నుంచి నిర్వహించతలపెట్టిన ఉద్యమ కార్యాచరణను తూచ తప్పకుండా అమలు చేయండి. ఇవి విజయవంతమయ్యే దాన్ని బట్టే మన హామీలు అమలయ్యే వీలుంటుంది’ అని ఐకాస నేతలు పిలుపునిచ్చారు. ఏపీ ఐకాస, ఏపీ ఐకాస అమరావతి నేతలు బుధవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మను కలిసి కార్యాచరణ నోటీసు అందజేశారు.