
సినిమా
హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ నటవిశ్వరూపానికి అద్దం పట్టిన సరికొత్త చిత్రం ‘అఖండ’. పవర్‌ప్యాక్డ్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రేక్షకుల అంచనాలు నిజం చేస్తూ బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్ సొంతం చేసుకొంది. మురళీకృష్ణ, శివుడిగా ద్విపాత్రాభినయంలో బాలయ్య అదరగొట్టేశారంటూ ‘అఖండ’ టీమ్‌పై సోషల్‌మీడియాలో ప్రశంసలు వర్షం కురుస్తోంది. బాలయ్య పంచ్ డైలాగ్‌లు, యాక్షన్ ఎపిసోడ్స్‌తోపాటు అఖండగా ఆయన చేసిన ఫెర్ఫార్మెన్స్ అదుర్స్ అని అందరూ ప్రశంసిస్తున్నారు. ఇక తమన్ అందించిన నేపథ్య సంగీతం సినిమాని మరోస్థాయికి తీసుకువెళ్లిందని అంటున్నారు.
👉 అఖండ విజయం సాధించిన ‘అఖండ’ సినిమా హీరో నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను, చిత్ర బృందానికి, అభిమానులకు అభినందనలు.
- నారా చంద్రబాబునాయుడు.
👉 ‘అఖండ’తో బోయపాటి- బాలయ్య మళ్లీ అదరగొట్టారు. యాక్షన్ అద్భుతంగా ఉంది. బోయపాటి తనదైన మార్క్‌లో పోరాటాల్ని చిత్రీకరించారు. బాలయ్యబాబు నటన, పాత్రల్లోకి ఒదిగిన విధానం చాలా బాగుంది. థియేటర్లలో మాస్ జాతర మొదలైంది.
- రాఘవేంద్రరావు
👉 బాలకృష్ణగారు అఘోరా పాత్రలో ఒదిగిపోయారు. తమన్ సంగీతం అద్భుతంగా ఉంది. బోయపాటి శ్రీను, చిత్ర బృందానికి శుభాకాంక్షలు.
- అనిల్ రావిపూడి
👉 బాలకృష్ణగారికి శుభాకాంక్షలు. తను బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అని బోయపాటి శ్రీను మరోసారి నిరూపించుకున్నారు. తమన్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం అదిరిపోయాయి.
- బండ్ల గణేశ్
👉 ‘‘అఖండ’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి వస్తోన్న భారీ స్పందనకు ఎంతో ఆనందంగా ఉంది. నందమూరి బాలకృష్ణతోపాటు బోయపాటి శ్రీను, చిత్రబృందం మొత్తానికి కంగ్రాట్స్’’
- మహేశ్‌బాబు
👉 ‘‘అఖండ’ గురించి ఎన్నో అద్భుతమైన విషయాలు వింటున్నాను. ఇండస్ట్రీకి మరలా రిలీజ్ డే ఎనర్జీని అందించిన బాలయ్య, బోయపాటికి నా ధన్యవాదాలు’’
- సందీప్ కిషన్
👉 ‘ప్రేక్షకుల్లో ‘అఖండ’ ఫీవర్ చూస్తుంటే ఆనందంగా ఉంది. నందమూరి బాలకృష్ణ, బోయపాటిశ్రీనుతోపాటు చిత్రబృందం మొత్తానికి నా అభినందనలు. తెలుగు సినిమా హవా మొదలైంది’’
- రామ్
👉 ‘‘అఖండ మాస్ జాతర. నటసింహం నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుకి కంగ్రాట్స్. తమన్ బావా.. నేపథ్య సంగీతం చంపేశావ్. NBK 107కి సిద్ధంగా ఉండు’’
- గోపీచంద్ మలినేని
👉 ‘‘అఖండ’మైన విజయాన్ని ఈరోజు మొత్తం తెలుగు సినీ పరిశ్రమ సెలబ్రేట్ చేసుకుంటోంది. తెలుగు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. బాలకృష్ణ, బోయపాటి శ్రీనులకు అభినందనలు’’
- నందిని రెడ్డి