
గ్రేటర్ హైదరాబాద్
ప్రధానికి మాజీ మంత్రి మండవ లేఖ
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని ఉప్పుడు బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలంటూ మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్రావు శనివారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. రాష్ట్ర రైతులు తరతరాలుగా వరి సాగు చేస్తున్నారని, దాని వల్లనే తమకు గిట్టుబాటు ధర వస్తుందని రైతులు నమ్ముతున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వ విధానం రైతులను అయోమయానికి గురిచేస్తోందన్నారు. యాసంగిలోనూ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని మరో లేఖలో మండవ సీఎం కేసీఆర్ను కోరారు.