
తెలంగాణ
జాతీయస్థాయి పరీక్ష జూన్ 12న నిర్వహణ
ఈనాడు, హైదరాబాద్: ఇంటర్ నుంచి ఆపై చదువులకు 2021-22 విద్యాసంవత్సరంలో ఉపకార వేతనాలు అందించేందుకు రాష్ట్రంలో (రాష్ట్ర స్థాయి) జాతీయ ప్రతిభా అన్వేషణ పరీక్ష-1(ఎన్టీఎస్)ను జనవరి 23వ తేదీన(ఆదివారం) నిర్వహించనున్నారు. ఈ మేరకు జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎన్సీఈఆర్టీ) ప్రకటించింది. ఆ రోజు ఏపీ సహా పశ్చిమబెంగాల్లో కూడా రాష్ట్ర స్థాయి పరీక్షలు జరుగుతాయని పేర్కొంది. అలాగే, జాతీయస్థాయి పరీక్ష(ఎన్టీఎస్ఈ-2)ను వచ్చే జూన్ 12వ తేదీన జరపాలని నిర్ణయించింది. దేశవ్యాప్తంగా 2 వేల మందిని ఉపకారవేతనాలకు ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి ఇంటర్లో రెండేళ్లపాటు నెలకు రూ.1250 చొప్పున, ఆ తర్వాత డిగ్రీ నుంచి పీజీ వరకు నెలకు రూ.2 వేల చొప్పున అందజేస్తారు.