
గ్రేటర్ హైదరాబాద్
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా 14వ తేదీ నుంచి సమ్మేటివ్ అసెస్మెంట్(ఎస్ఏ-1) పరీక్షలు ఉన్నందున ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు ఈ నెల 6 నుంచి 10వ తేదీ వరకు ప్రత్యేక అవసరాల పిల్లల అభివృద్ధిపై నిర్వహించతలపెట్టిన శిక్షణను వాయిదా వేయాలని పీఆర్టీయూ తెలంగాణ నేతలు విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియాను కోరారు. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మారెడ్డి అంజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి చెన్నయ్య తదితరులు శనివారం ఆయనకు వినతిపత్రం సమర్పించారు.