
గ్రేటర్ హైదరాబాద్
దిల్లీ: కార్మిక రాజ్య బీమా సంస్థ(ఈఎస్ఐసీ) తన సభ్యులకు వార్షిక వైద్య పరీక్షలను శనివారం ప్రారంభించింది. హైదరాబాద్‌తో పాటు అహ్మదాబాద్, ఫరీదాబాద్, కోల్‌కతాల్లోని ఈఎస్ఐ ఆసుపత్రుల్లో నిర్వహిస్తున్నట్లు సంస్థ తెలిపింది. బీమా పొంది, 40 ఏళ్లు, ఆపై వయసు గల సభ్యులకు ఉచితంగా ఈ సేవలను అందిస్తున్నారు.