
గ్రేటర్ హైదరాబాద్
పెద్దవడుగూరు, న్యూస్టుడే: సెల్ఫోన్లో అదేపనిగా ఆట ఆడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు ఓ విద్యార్థి. అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలానికి చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థి సెల్ఫోన్లో రోజూ ఓ ఆట ఆడుతూ దానికి అలవాటు పడిపోయాడు. ఇలా మూడు నెలలుగా ఆడుతున్నాడు. రెండు రోజుల క్రితం ఇంటి వద్ద స్పృహతప్పి పడిపోయాడు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న ఆ విద్యార్థి తల్లిదండ్రులను గుర్తు పట్టలేకపోతున్నాడు. కుమారుడి పరిస్థితిని చూసి ఆ దంపతులు బోరున విలపిస్తున్నారు. ఆటకు అలవాటు పడటంతో నరాలు చిట్లి అపస్మారక స్థితిలోకి వెళ్లాడని, కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని వైద్యులు చెప్పారని బంధువులు తెలిపారు.