
గ్రేటర్ హైదరాబాద్
ఈనాడు, హైదరాబాద్: సరైన మాస్క్ ఉంటేనే ప్రయాణికులను బస్సుల్లోకి అనుమతించాలి. డ్రైవర్, కండక్టర్ విధిగా మాస్క్ ధరించాలి. శానిటైజర్ సీసాను అందుబాటులో ఉంచుకోవాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను బస్స్టాండ్లలో మైకుల ద్వారా తరచూ ప్రకటిస్తుండాలని ఆయన సూచించారు. ‘డిపో నుంచి బస్సులు బయటకు వచ్చే ప్రతిసారీ పూర్తిస్థాయిలో శుభ్రం చేయాలి. బస్‌స్టాండు ఆవరణలో ప్రయాణికులు మాస్కులు ధరించడం అనివార్యమని స్పష్టంచేసే బ్యానర్లు ఏర్పాటుచేయాలి. బస్స్టాండ్లను తరచూ శుభ్రం చేస్తుండాలి. అన్ని రెస్ట్ రూముల్లో సబ్బులు అందుబాటులో ఉంచాల’ని సజ్జనార్ ఆదేశించారు.