
గ్రేటర్ హైదరాబాద్
15 వరకు ఆన్లైన్లో దరఖాస్తుల అందుబాటు
కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం
ఈనాడు, హైదరాబాద్: బీఎస్సీ నర్సింగ్, పీబీబీఎస్సీ నర్సింగ్, బీపీటీ, బీఎస్సీ ఎంఎల్టీ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో కన్వీనర్ కోటా సీట్ల ప్రవేశాలకు శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల ఆరో తేదీ నుంచి 15 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. వివరాలకు www.knruhs.telangana.gov.in వెబ్సైట్ సందర్శించాలని విశ్వవిద్యాలయం వర్గాలు సూచించాయి.