
తెలంగాణ
పీసీసీఎఫ్ లోకేశ్ జైశ్వాల్
పడ్కల్ ప్రాంతంలో మొక్కల్ని పరిశీలిస్తున్న పీసీసీఎఫ్ లోకేశ్ జైశ్వాల్ ఇతర అధికారులు
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో అటవీ పునరుద్ధరణ పనులు సత్ఫలితాలనిస్తున్నాయని.., హైదరాబాద్‌కు అతి సమీపంలో చుట్టూ నగరాన్ని ఆనుకుని ఉన్న 84 అటవీ బ్లాకుల్లో చేపడుతున్న పనులతో నగరవాసులకు స్వచ్ఛమైన గాలి అందుతుందని పీసీసీఎఫ్ (కంపా) లోకేశ్ జైశ్వాల్ పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లాల్లోని పట్టణ ప్రాంతాల్లో 29,545 హెక్టార్లలో ప్రత్యామ్నాయ అటవీకరణ నిధుల(కంపా)తో అటవీ పునరుద్ధరణ పనులు చేపట్టినట్లు వెల్లడించారు. అదనపు పీసీసీఎఫ్ సునీత భగవత్లో కలసి శనివారం ఇబ్రహీంపట్నం, కందుకూరు, ఆమనగల్, శంషాబాద్, మంఖాల్ అటవీ రేంజ్‌ల్లో పర్యటించి నాటిన మొక్కలను పరిశీలించారు.