
సినిమా
ఇంటర్నెట్ డెస్క్: అక్కినేని నాగార్జున, నాగచైతన్య కలిసి నటిస్తున్న చిత్రం ‘బంగార్రాజు’. నాగార్జున సరసన రమ్యకృష్ణ, నాగచైతన్యకు జోడీగా కృతిశెట్టి సందడి చేయనున్నారు. ఈ సినిమాలోని ‘నా కోసం’ అనే గీతాన్ని (లిరికల్ వీడియో) చిత్ర బృందం ఆదివారం విడుదల చేసింది. బాలాజీ సాహిత్యం అందించిన ఈ ప్రేమగీతానికి అనూప్ రూబెన్స్ స్వరాలు సమకూర్చారు. సిధ్ శ్రీరామ్ ఆలపించారు. చైతన్య, కృతిశెట్టిపై చిత్రీకరించిన పాట ఇది. ఈ జోడీ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఈ చిత్రం గతంలో వచ్చిన ‘సోగ్గాడే చిన్ని నాయనా’కి ప్రీక్వెల్‌గా రూపొందుతోంది. కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
► Read latest Cinema News and Telugu News
మరిన్ని
Lakshya: ఈసారి ‘జై శౌర్య’ అనే సౌండ్ వినిపించాలి: శర్వానంద్
Nootokka Jillala Andagadu: ఆ ఓటీటీలో శ్రీనివాస్ అవసరాల ‘నూటొక్క జిల్లాల అందగాడు’
Mahesh Babu: బాలకృష్ణను మెచ్చిన మహేశ్‌బాబు.. ఒకే వేదికపై సందడి
Bangarraju: ‘బంగార్రాజు’ ప్రేమగీతం.. నాగచైతన్య, కృతిశెట్టి జోడీ అదుర్స్!
Bigg Boss telugu 5: సన్నీకి ఫన్నీ మేకప్.. కాజల్‌ను ఇమిటేట్ చేసిన నాగార్జున