ఆంధ్రప్రదేశ్

Facebook Share Twitter Share Comments Telegram Share
భాజపాలో చేరితే కేంద్ర మంత్రి పదవిస్తామన్నారు

ఆప్‌ ఎంపీ భగవంత్‌ మాన్‌ ఆరోపణలు

చండీగఢ్‌: పంజాబ్‌ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అక్కడ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఆదివారం పంజాబ్‌ ఆప్‌ అధ్యక్షుడు, ఎంపీ భగవంత్‌ మాన్‌.. భాజపాపై విమర్శలు గుప్పించారు. ఆప్‌ను వదిలేసి తమ పార్టీలోకి చేరమని భాజపాకు చెందిన ఓ సీనియర్‌ నేత తనకు నాలుగు రోజుల క్రితం ఫోన్‌ చేశారని చెప్పారు. భారీగా నగదుతో పాటు.. కేంద్ర మంత్రిమండలిలోనూ చోటు కల్పిస్తామని ఆ నేత హామీ ఇచ్చారని ప్రకటించారు. ‘‘మాన్‌ సాబ్‌.. భాజపాలో చేరడానికి ఎంత తీసుకుంటారు. మీకు డబ్బు కావాలా’’ అని ఆ నేత తనను అడిగినట్లు మాన్‌ విలేకరుల సమావేశంలో తెలిపారు. తనను డబ్బుతో కొనలేరని, తానొక మిషన్‌ మీద రాజకీయాల్లోకి వచ్చానని కమిషన్‌ కోసం రాలేదని.. ఆ విషయాన్ని  భాజపా నేతకు స్పష్టం చేసినట్లు భగవంత్‌ మాన్‌ పేర్కొన్నారు.


మరిన్ని

దేవ‌తార్చ‌న

+

© 1999- 2022 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.