Latest Telugu News | Breaking News Telugu | Telugu News Today | News in Telugu

ఆంధ్రప్రదేశ్

Facebook Share Twitter Share Comments Telegram Share
సీఐడీ విభాగాధిపతి పీవీ సునీల్‌కుమార్‌కు జీవన సాఫల్య పురస్కారం

వర్చువల్‌గా పురస్కారం స్వీకరిస్తున్న సునీల్‌కుమార్‌

ఈనాడు, అమరావతి: సైబర్‌ భద్రతకు సంబంధించి అత్యుత్తమ ఆచరణ (బెస్ట్‌ ప్రాక్టిసెస్‌) అమలుకు గాను ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ విభాగానికి రెండు జాతీయ పురస్కారాలు వరించాయి. సీఐడీ విభాగాధిపతి, అదనపు డీజీపీ పీవీ సునీల్‌కుమార్‌కు ఈ విభాగంలో జీవన సాఫల్య పురస్కారం లభించింది. సీఐడీలోని సైబర్‌ నేరాల విభాగం ఎస్పీ జీఆర్‌ రాధికకు సైబర్‌ స్టార్‌ పురస్కారం దక్కింది. సెంటర్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఆన్‌ సైబర్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ డిజిటల్‌ ఫోరెన్సిక్స్‌ (సీఆర్‌సీఐడీఎఫ్‌), సమాచార భద్రత విద్య-అవగాహన (ఐఎస్‌ఈఏ) సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో సైబర్‌ భద్రతపై జరిగిన మూడో జాతీయ సదస్సులో ఈ పురస్కారాల్ని ప్రకటించారు. ఆదివారం జరిగిన పురస్కార ప్రదానోత్సవంలో పీవీ సునీల్‌కుమార్‌, జీఆర్‌ రాధిక వర్చువల్‌గా అవార్డులు స్వీకరించారు. సైబర్‌ నేరాలపై అవగాహన సదస్సుల నిర్వహణ, సామాజిక మాధ్యమాల్లో వేధింపులకు పాల్పడే వారిపై సైబర్‌ బుల్లీ షీట్లు తెరవటం తదితర కార్యక్రమాల అమలుకు ఈ పురస్కారాలు లభించినట్లు సీఐడీ ఒక ప్రకటనలో తెలిపింది.


మరిన్ని

+

© 1999- 2022 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.