
ఆంధ్రప్రదేశ్
14 నుంచి ప్రజాభాగస్వామ్యంతో వారోత్సవాలు: సీఎస్ సమీర్ శర్మ
ఈనాడు, అమరావతి: ఇంధన పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు ఈ నెల 14 నుంచి నిర్వహించే వారోత్సవాల్లో ప్రజలను భాగస్వాములను చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ సూచించారు. ఇంధన పరిరక్షణలో ఉత్తమ ప్రతిభ చూపిన సంస్థలు, పరిశ్రమలకు అవార్డులు అందించాలని అధికారులను ఆదేశించారు. ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్, ఇతర అధికారులతో ఆయన ఆదివారం చర్చించారు. ఇంధన సామర్థ్య రంగంలో రాష్ట్రం సాధించిన విజయాలను ప్రజలకు వివరించడంతో పాటు పరిశ్రమలు, భవన నిర్మాణం, మున్సిపల్ రంగాల్లోని సంస్థలకు పురస్కారాలు బహూకరించనున్నట్లు శ్రీకాంత్ చెప్పారు. అవార్డుల కోసం సంస్థలు ఈనెల 8 లోగా దరఖాస్తులను seca.apsecm @gmail.com, ceo.secm@gmail.com కు ఇ-మెయిల్ ద్వారా పంపాలని సూచించారు.
పరిశ్రమల కేటగిరీలో: టెక్స్టైల్స్, సిమెంట్, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు.
సంస్థలు: మున్సిపాలిటీలు/ పట్టణ స్థానిక సంస్థలు, హోటళ్లు, ఆసుపత్రులు, షాపింగ్ మాల్స్ వంటి వాణిజ్య భవనాలు
భవనాలు: విశ్వవిద్యాలయాలు, ఇంజినీరింగ్ కళాశాలలు (ప్రభుత్వ, ప్రైవేటు).