
గ్రేటర్ హైదరాబాద్
పురావస్తు పరిశోధకుడు శివనాగిరెడ్డి
బుద్ధవనంలో లభ్యమైన ఆనవాళ్లను పరిశీలిస్తున్న పురావస్తు పరిశోధకుడు శివనాగిరెడ్డి,
బుద్ధవనం ప్రత్యేకాధికారి లక్ష్మయ్య
నాగార్జునసాగర్, న్యూస్‌టుడే: నాగార్జునసాగర్‌లోని బుద్ధవనంలో కొత్త రాతియుగానికి సంబంధించిన ఆనవాళ్ల్లు లభ్యమైనట్లు పురావస్తు పరిశోధకుడు ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. బుద్ధవనంలో పాదచారుల దారి కోసం స్థలాన్ని పరిశీలిస్తుండగా నాలుగు చోట్ల.. కొత్త రాతియుగంలో వాడిన సూక్ష్మపనిముట్లను, గొడ్డళ్లను సానతీసే సందర్భంలో ఏర్పడిన గుంతలు వెలుగుచూశాయని ఆయన ఆదివారం వెల్లడించారు. ఆదిమానవులు ఆహార సంపాదన కోసం ఈ ప్రాంతాన్ని వినియోగించి ఉంటారని అభిప్రాయపడ్డారు. ఇక్కడ ఏర్పాటు చేయనున్న ట్రాకింగ్ పాత్ ద్వారా పురావస్తు పర్యాటకాభివృద్ధి కూడా జరుగుతుందని బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య తెలిపారు. కార్యక్రమంలో బుద్ధవనం ఓఎస్డీ సూదన్‌రెడ్డి, పర్యాటక సంస్థ ఎస్ఈ క్రాంతిబాబు తదితరులు పాల్గొన్నారు.
\