
తెలంగాణ
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణలో త్వరలో కొత్త క్రీడా విధానం అమల్లోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నామని, దీనికి సంబంధించిన కసరత్తు జరుగుతోందని ఆ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. మహారాష్ట్రలో ఇటీవల జరిగిన జాతీయ స్థాయి 34వ సీనియర్ పురుషుల, జూనియర్, సబ్ జూనియర్ ‘టగ్ ఆఫ్ వార్’ పోటీల్లో బంగారు, రజత పతకాలు సాధించిన తెలంగాణ క్రీడాకారుల బృందాన్ని ఆయన ఆదివారం హైదరాబాద్‌లో సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కొత్త క్రీడా విధానం ద్వారా క్రీడలకు మరింత ఊతమివ్వనున్నామని తెలిపారు. ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘంలో దీని విధివిధానాలపై చర్చించామన్నారు.