
తాజా వార్తలు
1.ధాన్యం కొనుగోళ్లకు సాధ్యమైనన్ని చర్యలు తీసుకోవాలి: హైకోర్టు
వానాకాలం పంటను కొనుగోలు చేసేందుకు వీలైనన్ని చర్యలు చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. జనవరి 22వ తేదీ వరకు ధాన్యం కొనుగోళ్లు కొనసాగుతాయని ప్రభుత్వ వివరణను హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. వానాకాలం పంట కొనుగోలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ న్యాయ విద్యార్థి శ్రీకర్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్రశర్మ ధర్మాసనం విచారణ చేపట్టింది.
2.ఓటీఎస్ నచ్చితేనే ఇల్లు రిజిస్ట్రేషన్: బొత్స సత్యనారాయణ
పేదలకు సొంతింటిపై పూర్తి హక్కుల కల్పనే వన్ టైమ్ సెటిల్మెంట్ (ఓటీఎస్) ముఖ్య ఉద్దేశం అని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. తెలుగుదేశం హయాంలో పేదల ఇళ్లకు ఎందుకని రిజిస్ట్రేషన్లు చేయలేదని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ఓటీఎస్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరితే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
3.కలెక్టర్ ఆరోపణలన్నీ అసత్యం.. మాకున్నది 8.36 ఎకరాలే: ఈటల జమున
జమున హేచరీస్‌కు సంబంధించిన భూములను ఈటల రాజేందర్ బలవంతంగా ఆక్రమించుకున్నారంటూ కలెక్టర్ హరీశ్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఈటల సతీమణి జమున ఆరోపించారు. సోమవారం షామీర్‌పేటలో ఆమె విలేకరులతో మాట్లాడారు. మెదక్ జిల్లాలోని అచ్చంపేట, హకీంపేటలలో ఈటెల రాజేందర్‌కు చెందిన జమున హేచరీస్ అసైన్డ్ భూములను ఆక్రమించుకున్నట్లు జిల్లా కలెక్టర్ హరీశ్ పేర్కొన్న నేపథ్యంలో ఆమె స్పందించారు.
4.కరోనా దెబ్బ.. ఎయిర్లైన్లకు రూ.19,564కోట్ల నష్టం
గత రెండేళ్లుగా వణికిస్తోన్న కరోనా మహమ్మారి దేశంలో దాదాపు అన్ని రంగాలను అతలాకుతలం చేసింది. కొవిడ్ దెబ్బకు విమానయానరంగ పరిశ్రమ కూడా భారీగా కుదేలైంది. నిబంధనల పేరుతో విధించిన ఆంక్షలు.. గతేడాది విమానయాన సంస్థలు, ఎయిర్‌పోర్టులకు పెను నష్టాన్ని తెచ్చిపెట్టాయి. కరోనా కారణంగా ఏడాది కాలంలో ఎయిర్లైన్లు దాదాపు రూ.20 వేలకోట్ల మేర నష్టాలను చవిచూశాయి.
5.భారత్‌లో మరో రెండు ఒమిక్రాన్ కేసులు
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ మన దేశంలోనూ చాపకింద నీరులా విస్తరిస్తోంది. మహారాష్ట్రలో మరో రెండు కొత్త కేసులు రావడం కలకలం రేపుతోంది. ఇప్పటికే మహారాష్ట్రలో ఎనిమిది కేసులు వెలుగుచూడగా.. ముంబయి మహా నగరంలో తాజాగా నమోదైన ఈ రెండు కేసులతో ఆ సంఖ్య 10కి చేరింది. ఇటీవల దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన 37 ఏళ్ల వ్యక్తితో పాటు అమెరికా నుంచి ముంబయికి వచ్చిన మరో వ్యక్తి (36)లో ఒమిక్రాన్ ఉన్నట్టు అధికారులు గుర్తించారు.
పుష్పరాజ్ వచ్చేశాడు
6.తదుపరి మహమ్మారి.. కరోనా కంటే ప్రాణాంతకం కావొచ్చు..!
కొవిడ్-19 కంటే భవిష్యత్తులో సంభవించే మహమ్మారులు మరింత ప్రాణాంతకంగా ఉండొచ్చట. అందుకే కరోనా నేర్పించిన పాఠాలను వృథా కానీయకుండా, మరో విజృంభణకు ప్రపంచం సిద్ధంగా ఉందని నిర్ధారించుకోవాలి. ఈ మాటలన్నది ఆక్స్ఫర్డ్/ఆస్ట్రాజెనికా టీకా సృష్టికర్తల్లో ఒకరైన సారా గిల్బర్ట్.
7.ఎట్-రిస్క్ దేశాల నుంచి వచ్చేవారికి ప్రత్యేక ఏర్పాట్లు!
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయాల నేపథ్యంలో హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్జీఐఏ) అధికారులు అప్రమత్తమయ్యారు. ఎట్ రిస్క్ దేశాల నుంచి వస్తున్న ప్రయాణికుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రపంచంలోని పలు దేశాల్లో కొత్త స్ట్రెయిన్ ఒమిక్రాన్ వ్యాప్తి పెరుగుతుండటంతో భారత ప్రభుత్వం ఇటీవల నూతన మార్గదర్శకాలను జారీ చేసిన విషయం తెలిసిందే.
8.పంజాబ్‌లో గెలుపే లక్ష్యం.. ఆ 2 పార్టీలతో సర్దుబాటు: కెప్టెన్
మరికొన్ని నెలల్లో జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే తమ లక్ష్యమని మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ అన్నారు. తామే గెలుస్తామని విశ్వాసం వ్యక్తంచేశారు. ఐదు దశాబ్దాల పాటు కాంగ్రెస్‌తో కలిసి నడిచిన ఆయన ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం ‘పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ’ పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
9.ఆరోగ్య బీమా ప్రీమియంపై GST.. కేంద్రం ఏమందంటే?
కొవిడ్-19 విజృంభణ వేళ.. ఆరోగ్య బీమా తీసుకోవడంపై ఎక్కువ మంది ప్రజలు దృష్టి పెడుతున్నారని నివేదికలు వెల్లడిస్తున్నాయి. మరోవైపు క్లెయింలు ఎక్కువ కావడంతో బీమా సంస్థలు ప్రీమియం పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో బీమా ప్రీమియంపై వస్తు, సేవల పన్ను (GST) 18శాతం చెల్లించాల్సి రావడం పట్ల పాలసీదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
10.సమష్టి కృషికి ఫలితమిది.. భారత్ విజయంపై దిగ్గజ క్రికెటర్ల స్పందన
ముంబయి వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో టీమ్ఇండియా 372 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో రెండు టెస్టుల సిరీస్‌ను భారత్ 1-0 తేడాతో కైవసం చేసుకున్నట్లయింది. పరుగుల పరంగా టెస్టుల్లో టీమ్ఇండియాకిదే భారీ విజయం కావడం గమనార్హం.
కెప్టెన్‌గా కోహ్లి ఖాతాలో అరుదైన ఘనత.!
మరిన్ని
IRCTC Rampath Yatra: ‘రామ్‌పథ్’ రైలులో కాశీ, అయోధ్య చుట్టొద్దామా..?
Unstoppable: అక్కినేని నాగేశ్వరరావులా మారిన బాలయ్య.. డైలాగ్ అదుర్స్!
IND vs NZ: అతడితో కలిసి బౌలింగ్ చేయడం గొప్ప అనుభూతి: జయంత్ యాదవ్
Supreme Court: మహారాష్ట్ర, బెంగాల్, రాజస్థాన్ ప్రభుత్వాలపై సుప్రీం ఆగ్రహం
TS corona update: తెలంగాణలో కొత్తగా 195 కరోనా కేసులు.. ఒకరి మృతి
Pandemic: తదుపరి మహమ్మారి.. కరోనా కంటే ప్రాణాంతకం కావొచ్చు..!
Windows 11: కొత్త విండోస్‌లో డీఫాల్ట్ బ్రౌజర్‌ను ఎలా మార్చాలంటే!
RGIA Hyderabad: ఎట్-రిస్క్ దేశాల నుంచి వచ్చేవారికి ప్రత్యేక ఏర్పాట్లు!
Bigg Boss telugu 5: ఎవరు ఏ స్థానంలో ఉండాలో ఏకాభిప్రాయం వచ్చినట్టేనా?
Bigg Boss 5: ‘బిగ్‌బాస్’కొచ్చి అలాంటి పనులెందుకు చేస్తా.. మానస్ అలా అంటాడనుకోలేదు!
IND vs NZ: సమష్టి కృషికి ఫలితమిది.. భారత్ విజయంపై దిగ్గజ క్రికెటర్ల స్పందన
Ts News: జగన్ హోదా పెరిగినందున సాక్షులను మరింత ప్రభావితం చేసే అవకాశం: సీబీఐ
WhatsApp: వాట్సాప్ కొత్త ఫీచర్లు.. వెబ్‌లో రియాక్షన్స్.. యాప్‌లో బబుల్స్
RRR: ‘ఆర్ఆర్ఆర్’ భీమ్.. రామరాజు కొత్త పోస్టర్లు అదుర్స్
Nagaland Firing: తీవ్రవాదులనే అనుమానంతోనే కాల్పులు.. పొరబాటుకు చింతిస్తున్నాం!
Unstoppable: వెన్నుపోటంటూ తప్పుడు ప్రచారం చేశారు: బాలకృష్ణ భావోద్వేగం
Revanth Reddy: తెరాస ఎంపీలు ప్రజల్ని మభ్యపెడుతున్నారు: రేవంత్‌రెడ్డి
Myanmar: ఆంగ్ సాన్ సూకీకి నాలుగేళ్ల జైలు.. తీర్పుచెప్పిన మిలిటరీ జుంటా
Omicron: ఒమిక్రాన్‌తో రీఇన్ఫెక్షన్ ముప్పు.. డెల్టా కంటే అధికంగానే..!
Modi: వ్యాక్సినేషన్లో మరో మైలురాయి.. ఈ వేగాన్ని ఇలాగే కొనసాగిద్దాం : మోదీ
Nagaland: నాగాలాండ్ ఘటనపై నేడు పార్లమెంట్లో అమిత్ షా ప్రకటన
Parliament: ఎంపీల సస్పెన్షన్ వివాదం.. సంసద్ టీవీ నుంచి తప్పుకొన్న శశిథరూర్
Omicron: ఒమిక్రాన్ ప్రభావం స్వల్పమే : ఐఐటీ-కాన్పుర్ ప్రొఫెసర్
Sourav Ganguly: ఒకానొక సమయంలో ద్రవిడ్‌పై ఆశలు వదులుకున్నాం: గంగూలీ
India Corona: కొత్త కేసులు 8 వేలే.. కానీ కలవరపెడుతోన్న ఒమిక్రాన్
TS News: ర్యాపిడో ప్రకటన వీడియో తొలగించండి: యూట్యూబ్‌కి కోర్టు ఆదేశం
Axar Patel: ఇది నా ‘డ్రీమ్ ఇయర్’.. అయితే నేర్చుకోవాల్సింది ఇంకా ఉంది: అక్షర్ పటేల్
WhatsApp: వాట్సాప్ ఖాతాను నిషేధించారా..? ఇలా పునరుద్ధరించుకోండి!
Bigg boss telugu 5: ప్రియాంక ఎలిమినేట్.. 90 రోజులు హౌస్‌లో ఉండటానికి కారణాలివే!
Madhya Pradesh: ‘ఏదో అదృశ్యశక్తి నా ఆహారాన్ని దొంగిలిస్తోంది’
AP News: కొయ్యలగూడెంలో చిన్నారుల మృతి సర్కారు హత్యలే: లోకేశ్
South Africa: ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నా.. ఆస్పత్రి చేరికలు తక్కువే!
IND vs NZ : కివీస్ మాజీ ఆల్‌రౌండర్ రికార్డును సమం చేసిన అశ్విన్
Crime News: అయిటిపాముల శివారులోని ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
Omicron Effect: వచ్చే రెండు నెలల్లో.. స్వల్ప స్థాయిలో థర్డ్‌వేవ్!
TS News: థర్డ్‌వేవ్‌పై భయం వద్దు.. అప్రమత్తంగా ఉండండి: డీహెచ్ శ్రీనివాస్‌రావు
AP News: రైతు ఆత్మహత్యల్లో ఏపీది రెండో స్థానం: నాదెండ్ల మనోహర్
Additional Dose: అదనపు డోసు.. డిసెంబర్ 6న నిపుణుల కమిటీ భేటీ!
Ganguly : ఇటీవల కాలంలో టీమ్ఇండియా అత్యంత పేలవ ప్రదర్శన అదే: గంగూలీ
Social Look: ‘గమనం’ గురించి చెప్పిన శ్రియ.. స్కైడ్రైవ్ చేసిన నిహారిక
Nagaland: పౌరులపై భద్రతా బలగాల కాల్పులపై ఆగ్రహం.. ఒటింగ్‌లో సైనిక శిబిరంపై దాడి
AP News: విశాఖ ఆర్కే బీచ్‌లో ముందుకొచ్చిన సముద్రం.. పర్యాటకులకు నో పర్మిషన్
AP News: కేంద్ర పథకాలకు సీఎం పేరు ఎలా పెట్టుకుంటారు?: సోము వీర్రాజు
IND vs NZ: కెమెరా వల్ల ఆగిపోయిన మ్యాచ్.. భారత ఆటగాళ్లు ఏం చేశారో చూడండి!
Pushpa: ‘ఇక్కడికి ఎలా వచ్చామో అలానే వెళ్లిపోదాం’.. ‘పుష్ప’ షూట్లో అల్లు అర్జున్!
Tirumala: తిరుమల ఘాట్రోడ్లో కొండచరియలు పరిశీలించిన కేరళ నిపుణుల బృందం
ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం లేదు.. రాజస్థాన్‌లో వచ్చేది మేమే: అమిత్‌షా