Latest Telugu News | Breaking News Telugu | Telugu News Today | News in Telugu

క్రీడలు

Facebook Share Twitter Share Comments Telegram Share
సఫారీ సమరం 26 నుంచి..

జొహానెస్‌బర్గ్‌: సొంతగడ్డపై న్యూజిలాండ్‌ను టీ20, టెస్టు సిరీస్‌ల్లో మట్టికరిపించిన టీమ్‌ఇండియా.. త్వరలోనే దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. ముందు అనుకున్నదాని కంటే ఈ పర్యటన వారం వాయిదా పడగా.. కొత్త షెడ్యూల్‌ను దక్షిణాఫ్రికా బోర్డు ప్రకటించింది. మూడు టెస్టుల సిరీస్‌ తొలి మ్యాచ్‌ సెంచూరియన్‌లో డిసెంబరు 26న మొదలు కానుంది. 2022 జనవరి 3-7 మధ్య జొహానెస్‌బర్గ్‌లో రెండో టెస్టు, 11-15 మధ్య కేప్‌టౌన్‌లో మూడో టెస్టు జరుగుతాయి. వన్డే సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు వరుసగా జనవరి 19, 21, 23 తేదీల్లో నిర్వహిస్తారు. భారత జట్టు ఇప్పటిదాకా టెస్టు సిరీస్‌ గెలవని ఏకైక దేశం దక్షిణాఫ్రికానే. ఈ పర్యటనలో అయినా ఆ లోటు తీర్చుకోవాలని టీమ్‌ఇండియా పట్టుదలతో ఉంది.


మరిన్ని

+

© 1999- 2022 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.