
క్రీడలు
భారత్-ఏతో మూడో అనధికార టెస్టు
బ్లూమ్‌ఫోంటీన్: నవ్‌దీప్ సైని మూడు వికెట్లు పడగొట్టినప్పటికీ భారత్-ఏతో మూడో అనధికార టెస్టు తొలి రోజు దక్షిణాఫ్రికా-ఎ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లకు 249 పరుగులు చేయగలిగింది. సరెల్ ఎర్వీ (75), డి జోర్కి (58), జొండో (56) రాణించారు. సైని 42 పరుగులకు 3 వికెట్లు పడగొట్టగా.. ఎడమచేతి వాటం స్పిన్నర్ సౌరభ్ కుమార్ రెండు వికెట్లు తీసుకున్నాడు. సోమవారం ఆట చివరికి జన్సెన్ (4), ప్రిటోరియస్ (1) క్రీజులో ఉన్నారు.