
క్రీడలు
దిల్లీ: ఆసియా యూత్ పారా క్రీడల్లో భారత షట్లర్లు 16 పతకాలు సాధించారు. పాలక్ కోహ్లి, సంజన కుమారి, హార్దిక్ మక్కర్ తలో మూడు పతకాలు గెలుచుకున్నారు. షట్లర్లు మొత్తం 4 స్వర్ణాలు, 7 రజతాలు, 5 కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారు. ఆసియా యూత్ పారా క్రీడలు బహ్రెయిన్‌లో ఈ నెల 2 నుంచి 6 వరకు జరిగాయి.