
ఆంధ్రప్రదేశ్
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదముద్ర
ఈనాడు, దిల్లీ: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులుగా కుంభాజడల మన్మథరావు, బొడ్డుపల్లి శ్రీభానుమతి నియమితులయ్యారు. వీరి పేర్లను సూచిస్తూ నవంబరు 11న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం చేసిన సిఫార్సులకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 217(1) కింద ఉన్న అధికారాలను అనుసరించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేసినట్లు న్యాయశాఖ సోమవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. మన్మథరావు న్యాయవాద వృత్తిలో ఉండగా... భానుమతి ప్రస్తుతం హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌గా సేవలందిస్తున్నారు. వీరిద్దరి నియామకంతో ఏపీ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 20కి చేరనుంది. వారు బుధ, గురువారాల్లో ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది. వీరి నియామకంతో దేశవ్యాప్తంగా ఈ ఏడాది వివిధ హైకోర్టుల్లో ఇప్పటివరకూ మొత్తం 120 మంది న్యాయమూర్తులను నియమించినట్లయింది.