
జాతీయ- అంతర్జాతీయ
రాష్ట్రాలపై మండిపడ్డ సుప్రీంకోర్టు
దిల్లీ: కరోనా కారణంగా మరణించిన వారి కుటుంబాలకు పరిహారం చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు జాప్యం చేస్తుండడంపై సోమవారం సుప్రీంకోర్టు మండిపడింది. ఒక్కో కుటుంబానికి రూ.50వేల వంతున ఇవ్వాలని అక్టోబరు నెలలో ఆదేశించగా ఇంతవరకు పూర్తిగా అమల్లోకి రాలేదు. దాంతో ఈ పథకంపై విస్తృత ప్రచారం ఇవ్వాలని ఆదేశించింది. దీనిపై జస్టిస్ ఎం.ఆర్.షా, జస్టిస్ బి.వి.నాగరత్నలతో కూడిన ధర్మాసనం విచారణ జరుపుతోంది. ‘‘మహారాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన ప్రమాణ పత్రంతో ఏమాత్రం సంతృప్తి చెందడం లేదు. లక్షకు పైగా మరణాలు నమోదయితే పరిహారం కోసం 37వేల దరఖాస్తులు వచ్చాయి. ఇంతవరకు ఒక్కరికి కూడా పరిహారం ఇవ్వలేదు. ఇది హాస్యాస్పదం. ఆమోదయోగ్యం కాదు’’ అని వ్యాఖ్యానించింది.