
ఆంధ్రప్రదేశ్
కేవలం పరస్పర అంగీకార విధానంలోనే
ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని ప్రభుత్వం కొంతమేర సడలించింది. కేవలం ఉద్యోగుల పరస్పర అంగీకారంతో ఒకచోట నుంచి మరోచోటికి బదిలీ అయ్యేందుకు వీలు కల్పించింది. ఈ మేరకు ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రావత్ ఉత్తర్వులు ఇచ్చారు. కొవిడ్ కారణంగా 2020, 2021 మే నెలల్లో బదిలీలకు ప్రభుత్వం అవకాశం ఇవ్వలేకపోయింది. రెండేళ్లుగా బదిలీలు లేకపోవడంతో ఉద్యోగ సంఘాల నుంచి వచ్చిన వినతుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2022 జనవరి 4 వరకు ఈ బదిలీలకు అవకాశం కల్పించింది. ఇవీ మార్గదర్శకాలు..
* పరస్పర బదిలీలకు ఆమోదయోగ్యమైన ఉద్యోగులు ఇద్దరూ సంబంధిత అధికారికి దరఖాస్తు చేసుకోవాలి. వారు ప్రస్తుత పోస్టులో కనీసం రెండేళ్లు పనిచేసి ఉండాలి.
* లోకల్ క్యాడర్లో మాత్రమే వీటిని అనుమతిస్తారు. ఇద్దరూ ఒకే క్యాడర్లో ఉండాలి.
* అవినీతి కేసులు, ఇతరత్రా అభియోగాలున్నవారు అనర్హులు.