
ఆంధ్రప్రదేశ్
సంఘం రాష్ట్ర నేతల డిమాండ్
విజయవాడ, న్యూస్‌టుడే: వీఆర్వోలపై మంత్రి అప్పలరాజు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, తక్షణమే ఆయన క్షమాపణ చెప్పాలని ఆంధ్రప్రదేశ్ వీఆర్వోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.ఆంజనేయ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి.హెచ్.సురేష్‌బాబు డిమాండ్ చేశారు. విజయవాడలోని అసోసియేషన్ కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో వారు మాట్లాడారు. ఏపీ ఐకాస, ఐకాస అమరావతి ఐక్యవేదిక పిలుపు మేరకు వీఆర్వోలు ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొంటారని వెల్లడించారు.