
ఆంధ్రప్రదేశ్
రాజ్యసభలో జలశక్తి శాఖ మంత్రి షెకావత్
ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో 10,981 పాఠశాలల్లో మరుగుదొడ్లు పని చేయడం లేదని, 18,874 బడుల్లో చేతులు కడుక్కునే సదుపాయం లేదని కేంద్ర మంత్రి షెకావత్ రాజ్యసభలో సోమవారం అడిగిన ఓ ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. ఆంధ్రప్రదేశ్ పరంగా పరిశీలిస్తే... ‘పట్టణాల కంటే గ్రామీణంలో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంది. గ్రామాల్లో 10,100... పట్టణాల్లో 881 పాఠశాలల్లో మరుగుదొడ్లు పని చేయడం లేదు. గ్రామీణంలో 17,379, పట్టణాల్లో 1,495 పాఠశాలల్లో చేతులు కడుక్కునే సదుపాయం లేదు. 38,678 చోట్ల సురక్షితమైన తాగునీరు లేదు. 38,678 బడుల్లో చేతిపంపులు, 38,685 పాఠశాలల్లో నల్లా సదుపాయం ఉంది’ అని ఆయన పేర్కొన్నారు.