ఆంధ్రప్రదేశ్

Facebook Share Twitter Share Comments Telegram Share
వారం రోజులు సామాజిక సేవ చేయండి

కోర్టు ధిక్కరణ కేసులో అనంతపురం డీఈవోకు హైకోర్టు ఆదేశం

ఈనాడు, అమరావతి: కోర్టు ధిక్కరణ కేసులో అనంతపురం జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో) కె.శామ్యూల్‌ను సామాజిక సేవ చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఆ జిల్లాలో ఏదైనా వృద్ధాశ్రమంలోగానీ, అనాథాశ్రమంలోగానీ వారం రోజులు భోజన ఖర్చులు భరించాలని స్పష్టం చేసింది. ఆ వివరాలను హైకోర్టుకు సమర్పించాలంటూ వ్యాజ్యంపై విచారణను మూసివేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ సోమవారం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు. కోర్టు ఆదేశాలను అమలు చేయకపోవడం కక్షిదారులకు న్యాయం దొరకకుండా చేయడమే కాదు కోర్టులను అవమానించడం కూడా అని ఈ సందర్భంగా న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ తీరుతో కోర్టులు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయే పరిస్థితి తీసుకురావద్దని అధికారులకు హితవు పలికారు. అనంతపురం జిల్లాకు చెందిన సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ పి.వెంకటరమణ.. నోషనల్‌ సీనియారిటీ కల్పించే వ్యవహారంపై 2019లో హైకోర్టును ఆశ్రయించారు. సీనియారిటీ కల్పించాలన్న కోర్టు ఆదేశాలను అమలు చేయలేదంటూ ఆయన అధికారులపై 2020లో కోర్టు ధిక్కరణ వ్యాజ్యం వేశారు. సోమవారం జరిగిన విచారణకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్‌, అప్పటి కమిషనరు చినవీరభద్రుడు, అనంతపురం డీఈవో శామ్యూల్‌ హాజరయ్యారు. ముఖ్య కార్యదర్శి, కమిషనరు వివరణతో సంతృప్తి చెందిన కోర్టు వారిపై కోర్టు ధిక్కరణను మూసివేసింది. న్యాయస్థానం ఆదేశాల అమల్లో ఏడాది జాప్యం చోటు చేసుకున్నందుకు డీఈవోను బాధ్యుడిగా తేల్చింది. ఆయన క్షమాపణలు కోరారు. క్షమాపణను అంగీకరించాలంటే సామాజిక సేవ చేయాలని న్యాయమూర్తి సూచించగా డీఈవో అంగీకరించారు.


మరిన్ని

దేవ‌తార్చ‌న

+

© 1999- 2022 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.