
గ్రేటర్ హైదరాబాద్
కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ
భాజపాలో చేరిన టీఎస్పీఎస్సీ మాజీ సభ్యుడు విఠల్
విఠల్‌కు పుష్పగుచ్ఛం అందజేస్తున్న భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్ ఛుగ్. చిత్రంలో ఎంపీలు అర్వింద్, బండి సంజయ్, కేంద్ర మంత్రి నఖ్వీ
ఈనాడు, దిల్లీ: దేశంలో పరిస్థితులు కుటుంబ పాలన నుంచి ప్రజాస్వామ్యం దిశగా పయనిస్తున్నాయని కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ అన్నారు. ఓ వైపు కొన్ని పార్టీలు వారసత్వ రాజకీయాలకు ప్రయత్నిస్తుంటే భాజపా మాత్రం ప్రజాస్వామ్య విస్తరణ, రక్షణకు పోరాడుతోందని తెలిపారు. దిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్ ఛుగ్, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అర్వింద్‌ల సమక్షంలో టీఎస్పీఎస్సీ మాజీ సభ్యుడు, తెలంగాణ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు విఠల్ సోమవారం భాజపాలో చేరారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. నిజమైన ఉద్యమకారులకు భాజపా వేదికైందన్నారు. విఠల్ మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించిన వారెవరికీ తెరాస ప్రభుత్వ హయాంలో గౌరవం దక్కడం లేదని ఆరోపించారు.