
తెలంగాణ
ఈనాడు, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం గుర్తించిన ముప్పు ఉన్న(రిస్క్) దేశాల నుంచి శంషాబాద్ విమానాశ్రయంలో వచ్చే ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్ పీసీఆర్ పరీక్షల కోసం ముందస్తు బుకింగ్ చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఆర్టీపీసీఆర్ పరీక్షకు ఇప్పటివరకు రూ.999 తీసుకుంటుండగా.. ఇకపై రూ.750 వసూలు చేస్తారు. దీని ఫలితం 6 గంటల్లో వస్తుంది. ర్యాపిడ్ పీసీఆర్‌కు రూ.3,900 తీసుకుంటారు. 2గంటల్లో ఫలితం వస్తుంది. ఈ పరీక్షలకు ముందస్తుగా www.hyderabad.aero లేదా http://covid.mapmygenome.in లో బుక్ చేసుకోవచ్చని అధికారులు సూచించారు.