
గ్రేటర్ హైదరాబాద్
పంటల కొనుగోలుపై అధ్యయనానికి గత నెలలో పంజాబ్లో పర్యటించిన ‘తెలంగాణ రాష్ట్ర సహకార మార్కెటింగ్ సమాఖ్య’(మార్క్ఫెడ్) బృందానికి కరోనా సోకింది. ఛైర్మన్ గంగారెడ్డి, ఎండీ యాదిరెడ్డి సహా అయిదుగురికి పాజిటివ్ నిర్ధారణ అయింది. గంగారెడ్డి ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారు.