
తెలంగాణ
ఖమ్మం వ్యవసాయ మార్కెట్, న్యూస్టుడే: ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో సోమవారం ఏసీ తేజ రకం ఎండు మిరపకు రికార్డు ధర పలికింది. వ్యాపారులు క్వింటాకు గరిష్ఠంగా రూ.18,500 చొప్పున పోటీపడి కొనుగోలు చేశారు. కనిష్ఠ ధర రూ.9,800, నమూనా ధర రూ.13,600 పలికింది. సోమవారం విపణికి మొత్తం 800 బస్తాలు రాగా గంట వ్యవధిలోనే కొనుగోళ్లు పూర్తయ్యాయి. మిరపకు ఈ సీజన్లో ఇంత ధర పలకడం ఇదే తొలిసారి. ఈ నెల 3న క్వింటాకు గరిష్ఠ ధర రూ.14,650 ఉండగా.. 3 రోజుల వ్యవధిలోనే రూ.3,850 అదనంగా పెరగడం గమనార్హం.