
గ్రేటర్ హైదరాబాద్
యాదగిరిగుట్ట, న్యూస్టుడే: యాదాద్రి ఆలయ విమాన గోపురానికి స్వర్ణ కవచం తొడిగే క్రతువుకోసం ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సోమవారం రూ.55 లక్షల డీడీని ఆలయ ఈవో గీతారెడ్డికి అందజేశారు. తొలుత ఆలయంలో స్వామిని సతీసమేతంగా దర్శించుకొని విరాళాన్ని అందజేశారు.