
తాజా వార్తలు
2022 బీజింగ్ వింటర్ ఒలింపిక్స్‌పై అమెరికా దౌత్య బహిష్కరణ
ఇంటర్నెట్‌డెస్క్ ప్రత్యేకం
చైనాకు దౌత్యపరంగా అతిపెద్ద దెబ్బ తగిలింది. ఏదైతే జరుగుతుందని షీజిన్‌పింగ్ భయపడ్డారో.. అదే వాస్తవ రూపం దాల్చింది. 2022 బీజింగ్ వింటర్ ఒలింపిక్స్‌ను దౌత్యపరంగా బహిష్కరిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. శ్వేతసౌధం నుంచి ప్రతినిధులు ఎవరూ ఈ ఒలింపిక్స్‌లో పాల్గొనరని స్పష్టం చేసింది. చైనాలో మానవహక్కుల ఉల్లంఘనల కారణంగా ఈ నిర్ణయం తీసుకొన్నట్లు చెప్పింది. శ్వేతసౌధం ప్రెస్ సెక్రటరీ జెన్‌సాకీ ఈ విషయాన్ని సోమవారం అధికారికంగా ధ్రువీకరించారు. వీటికి సంబంధించిన ఉత్సవాల్లో తమ సిబ్బంది పాల్గొనరని వెల్లడించారు. ‘‘జిన్జియాంగ్ ప్రావిన్స్‌లో దారుణమైన మానవ హక్కుల ఉల్లంఘనల నేపథ్యంలో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా దీనిని ప్రచారం కోసం వాడుకొంటోందని అమెరికా భావిస్తోంది. మేము ఆ పనిచేయలేం. కానీ, ఈ క్రీడల కోసం కఠినంగా సాధన చేసిన అథ్లెట్లను శిక్షించాలని అమెరికా అనుకోవడంలేదు. అందుకే మా అధికారిక దౌత్య బృందాన్ని మాత్రం 2022 క్రీడలకు పంపకపోవడం చైనాకు సరైనా సందేశాన్ని ఇస్తుంది’’ అని తెలిపారు. చైనా పరపతిని నేరుగా ఢీకొనే క్రమంలో అమెరికా తీసుకొన్న తొలి నిర్ణయం ఇది.
డిప్లొమేటిక్ బాయ్‌కాట్ అంటే..?
డిప్లొమేటిక్ బాయ్‌కాట్ అంటే క్రీడలను బాయ్‌కాట్ చేయడం కాదు. అథ్లెట్లు హాజరై క్రీడల్లో పాల్గొంటారు. కానీ, ఒలింపిక్స్‌లో జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమం, ముగింపు కార్యక్రమం వంటి వాటికి దేశాధినేతలు, కీలక అధికారులు హాజరుకాకపోవడం. ఇలా చేయడం వల్ల ఆ ఒలింపిక్స్ ప్రాధాన్యం తగ్గిపోతుంది. అదే సమయంలో చైనా వీఘర్ల పట్ల చేస్తున్న అత్యాచారాలు ప్రపంచ వ్యాప్తంగా వార్తల్లో నిలిచి చర్చనీయాంశాలు అవుతాయి. ఆ రకంగా చైనాపై ఒత్తిడి పెరుగుతుంది.
పరువు కాపాడుకొనేందుకు చైనా అవస్థ..
వాస్తవానికి అమెరికా ఈ నిర్ణయం తీసుకొంటుందని చైనా కొన్ని నెలల ముందే అనుమానించింది. దీంతో పరువు కాపాడుకొనేందుకు కొన్ని రోజులుగా కొత్త ప్రచారం మొదలుపెట్టింది. కొవిడ్ నిబంధనలు కారణంగా అతిథులను ఆహ్వానించడం లేదని చెబుతోంది. మరోవైపు అమెరికా నిర్ణయంపై వాషింగ్టన్‌లోని దౌత్యకార్యాలయం మండిపడింది. ‘‘ఒలింపిక్ చార్టర్ స్ఫూర్తిని అమెరికా వక్రీకరిస్తోంది. అసలు వీరు క్రీడా సంబరాలకు వస్తారా..? రారా..? అన్న విషయాన్ని ఎవరూ పట్టించుకోరు. 2022 బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ విజయవంతం అవుతాయా.. లేదా అన్న అంశంపై ఇది ఏమాత్రం ప్రభావం చూపదు. అసలు అమెరికా రాజకీయ ప్రతినిధులకు ఆహ్వానమే లేదు. అలాంటప్పుడు దౌత్య బహిష్కారానికి అవకాశం ఎక్కడుంది?’’ అని చైనా ప్రతినిధి ల్యూపెంగై పేర్కొన్నారు.
ఇక చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి ఝావో లిజియాన్ స్పందిస్తూ ‘‘అమెరికా ఒంటెత్తు పోకడలకు పోతే దానికి ప్రతిస్పందన ఉంటుంది. వింటర్ ఒలింపిక్స్ అనేవి రాజకీయాలకు, వక్రీకరణలకు వేదిక కావని నొక్కి చెబుతున్నాను’’ అని పేర్కొన్నారు.
బాయ్‌కాట్‌పై అప్పుడే ఆన్లైన్ సెన్సారింగ్..
చైనా అప్పుడే ఆన్లైన్ కత్తికి పదునుపెట్టడం మొదలుపెట్టింది. చైనా సోషల్ మీడియా వేదిక ‘విబో’లో వింటర్ ఒలింపిక్స్ బాయ్‌కాట్ అనే పదాన్ని సెన్సార్ చేశారు. మంగళవారం ఉదయం నాటికి పూర్తిగా తొలగించారు. ఇక గ్లోబల్ టైమ్స్ పత్రిక ప్రచురించిన వార్త కింద కామెంట్లలో చాలా వరకూ ఎడిట్ చేశారు. మొత్తం 1500 వరకు కామెంట్లు వస్తే కేవలం చైనాకు అనుకూలంగా ఉన్న 8 మాత్రమే ఉంచారు.
అమెరికా నిర్ణయానికి కారణమేంటీ..?
వీఘర్ ముస్లింల విషయంలో చైనా అనుసరిస్తున్న వైఖరితో బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ -2022కు ఇబ్బందికరంగా మారింది. ఒలింపిక్స్‌ను ప్రపంచ దేశాలు బహిష్కరించడం గానీ, వేదికను మార్చడం గానీ చేయాలన్న డిమాండ్లు చాలా రోజులుగా ఉన్నాయి. ఈ ఏడాది మే నాటికే 180కిపైగా మానవ హక్కుల సంస్థలు ఈ ఒలింపిక్స్‌ను బహిష్కరించాలనే డిమాండ్లను ప్రభుత్వాల ముందు పెట్టాయని ‘ది గార్డియన్ ’ పత్రిక పేర్కొంది.
ఫలించిన పెలోసీ ప్రయత్నం..!
వీఘర్లపై అత్యాచారాలను నిరోధించేందుకు ఒలింపిక్స్‌ను ఆయుధంగా వాడాలని అమెరికాలో అత్యంత శక్తిమంతమైన మహిళల్లో ఒకరైనా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ ప్రయత్నాలు మొదలుపెట్టారు. కొన్ని నెలల క్రితం అమెరికా కాంగ్రెస్ విచారణలో మాట్లాడుతూ చైనా వీఘర్లపై చేస్తున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా బీజింగ్‌లో 2022లో జరిగే ఒలింపిక్స్‌ను దౌత్యపరంగా బహిష్కరించాలని(డిప్లొమేటిక్ బాయ్‌కాట్) పిలుపునిచ్చారు. తాజా నిర్ణయంపై పెలోసీ స్పందిస్తూ..‘‘అమెరికా అయినా.. ప్రపంచమైనా సరే క్రీడాకారులకు కచ్చితంగా మద్దతు ఇవ్వాల్సిందే. కానీ, ఒక నరమేధానికి , మానవహక్కుల ఉల్లంఘనలకు పాల్పడే దేశం నిర్వహించే క్రీడలకు అసలేమీ జరగనట్లు అధికారికంగా మద్దతు ఇవ్వలేం’’ అని పేర్కొన్నారు.
అమెరికా రాజకీయాల్లో ప్రత్యర్థులకు మింగుడుపడని మహిళగా నాన్సీకి పేరుంది. ట్రంప్‌ను ముప్పుతిప్పలు పెట్టిన డెమొక్రాట్ కూడా ఈమే కావడం విశేషం. చైనా అరాచకాల విషయంలో నాన్సీ మొదటి నుంచి తీవ్రంగానే స్పందించేవారు. గతంలో టిబెట్ వాసులపై చైనా అరాచకాలపై గళం విప్పారు. జార్జి డబ్ల్యూ బుష్ అధికారంలో ఉండగా అప్పట్లో జరిగిన బీజింగ్ సమ్మర్ ఒలింపిక్స్‌ను బహిష్కరించాలని ఆయనకు సూచించారు. అప్పట్లో ఆమె యూఎస్ హౌస్ స్పీకర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. బుష్ బీజింగ్ సందర్శించడాన్ని మరింత కఠినతరం చేసేలా ఆమె అప్పట్లో భారత్‌కు వచ్చి దలైలామాతో భేటీ కూడా అయ్యారు. కానీ, నాటి అధ్యక్షుడు బుష్ ఆమె మాట వినలేదు. బీజింగ్ ఒలింపిక్స్‌కు హాజరయ్యారు.
భారత్ మద్దతిచ్చినా పుల్లలు పెట్టాలని చూసిన డ్రాగన్..!
భారత్, చైనా, రష్యాలు ఆర్ఐసీ గ్రూప్‌లో సభ్య దేశాలు. ఇటీవల జరిగిన ఈ గ్రూపు సమావేశ ప్రకటనలో చైనా ఓ అంశాన్ని చేర్చింది. దీని ప్రకారం ఆర్ఐసీ దేశాలు బీజింగ్‌లో జరిగే వింటర్ ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్ మద్దతు తెలిపాయి. భారత్ ఈ ప్రకటన అంగీకరించడానికి రష్యా ప్రధానకారణం. కానీ, చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ మాత్రం దీనిని వక్రీకరించి ప్రచారం చేసింది. ‘భారత్ సొంతగా వ్యవహరిస్తుందే కానీ.. అమెరికాకు ఏ మాత్రం సహజ మిత్ర దేశం కాదు ’ అంటూ పుల్లలు పెట్టే ప్రయత్నం చేసింది. ఈ మేరకు ఒక కథనం ప్రచురించింది. అమెరికాతో బలమైన దౌత్య సంబందాలు కలిగి ఉన్నా.. స్థానిక, అంతర్జాతీయ వ్యవహారాల్లో అగ్రరాజ్యాన్ని అనుసరించకుండా స్వతంత్ర వైఖరితో ముందుకెళ్తోందంటూ రెచ్చగొట్టే యత్నం చేసింది.
► Read latest National - International News and Telugu News
మరిన్ని
MEA: ఆంగ్ సాన్ సూచీకి జైలుశిక్షపై స్పందించిన భారత్.. ఏమన్నదంటే?
Covid vaccine: వ్యాక్సిన్ మైత్రి.. విదేశాలకు 7.23 కోట్ల డోసుల సరఫరా
BSF: అందుకే బీఎస్ఎఫ్ పరిధిని పెంచాం.. కేంద్ర మంత్రి వెల్లడి
Tirumala: తిరుమలలో ఎఫ్ఎమ్ఎస్ ఏజెన్సీ సేవలు పునరుద్ధరించాలి: అదనపు ఈవో ధర్మారెడ్డి
Google Chat: జీమెయిల్లో గూగుల్ చాట్.. సులువుగా ఆడియో/వీడియో కాలింగ్!
Harsh Goenka: ఒకేసారి 900 మంది ఉద్యోగుల తొలగింపు.. తప్పు పట్టిన గోయెంకా
HP Laptops: గేమర్స్ కోసం హెచ్‌పీ కొత్త ల్యాప్‌టాప్.. ధర, ఫీచర్లివే!
Ap corona update: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 184 కొవిడ్ కేసులు.. ఇద్దరు మృతి
AP News: ఉపా చట్టం ఉపయోగించినా ఉద్యమం ఆగదు : బండి శ్రీనివాస్
Yuvi : అభిమానులారా సిద్ధంగా ఉన్నారా? ‘బిగ్ సర్ప్రైజ్ ఉంది’ : యువీ
TS News: తెలంగాణ పురపాలక అధికారులు ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు: ఈసీ
Germany Chancellor: ఏంజెలా మెర్కెల్.. ముగిసిన 16 ఏళ్ల ప్రస్థానం..!
IND vs NZ: ఆ ఒక్క రికార్డుతో జీవితమేం మారిపోదు.. కానీ : అజాజ్ పటేల్
Omicron scare: బూస్టర్లు ఇవ్వండి.. డోసుల మధ్య వ్యవధి తగ్గించండి..!
Sirivennela: ‘శ్యామ్ సింగరాయ్’ ..‘సిరివెన్నెల’ చివరి గీతమిదే..!
Uttar Pradesh: ప్రాక్టికల్స్ పేరిట పిలిపించి.. 17 మంది బాలికలపై వేధింపులు!
Virat Kohli: ఇంతకుముందు చెప్పినట్లే.. కోహ్లీనే ‘ది బెస్ట్’: ఇర్ఫాన్
Rahul Gandhi: ఉద్యమంలో మరణించిన రైతులు వీరే.. పరిహారం ఇవ్వండి: రాహుల్ గాంధీ
Omicron: తగిన చర్యలు తీసుకోకపోతే.. భారీగా మూడో ముప్పు రావొచ్చు..!
Chiranjeevi: చిరంజీవా.. మజాకా! ఒకే నెలలో నాలుగు సినిమాల్లో..
IND vs NZ: వీరూ.. నా బౌలింగ్‌లో దంచికొట్టడం ఇంకా గుర్తుంది: అజాజ్
Modi: మారండి.. లేదంటే మార్పులు తప్పవు: ఎంపీలకు మోదీ వార్నింగ్..!
IND vs NZ: అశ్విన్‌ను అధిగమించడం సాధ్యమేనా.. ముందూ వెనుక ఎవరంటే?
Sridevi Drama Company: రామ్‌చరణ్‌లా ఆది.. అల్లు అర్జున్‌లా రాంప్రసాద్!
Omicron: మొదటి ఒమిక్రాన్ బాధితుల్లో ఒకరికి మరోసారి వైరస్ పాజిటివ్..!
Prabhas: ఏపీ వరదలు.. సీఎం సహాయ నిధికి ప్రభాస్ విరాళం ఎంతంటే..?
Rajya Sabha: ఎంపీల సస్పెన్షన్‌పై రాజ్యసభలో అదే రగడ.. మళ్లీ వాయిదా
Beijing Winter Olympics: జిన్‌పింగ్‌తో గేమ్ మొదలుపెట్టిన బైడెన్..!
త్రివిధ దళాల్లో పనిచేసిన ఏకైన యోధుడు ప్రీతిపాల్‌సింగ్ కన్నుమూత
IND vs NZ: వాంఖడే పిచ్ క్యూరేటర్‌కు టీమ్ఇండియా నగదు బహుమతి
Corona Vaccine: నర్సు పొరపాటు.. ఇద్దరు శిశువులకు కొవిడ్ టీకా
మోదీ, ప్రియాంక చోప్రా, అక్షయ్ కుమార్.. వీరంతా బిహార్‌లో టీకా తీసుకున్నారట..!
Katrina-Vicky: కత్రినా-విక్కీ వివాహం.. ఓటీటీ ₹100కోట్ల ఆఫర్!
India Corona: భారీగా తగ్గిన కొత్త కేసులు.. అయినా అలక్ష్యం వద్దు..!
IND vs SA: ‘దక్షిణాఫ్రికా పర్యటనలో అశ్విన్‌ను పక్కనపెట్టినా ఆశ్చర్యపోను’
Bigg Boss telugu 5: బిగ్‌బాస్‌లో టాప్-6 ర్యాంకులు.. ఈ వారం నామినేట్ అయింది వీరే!
IND vs NZ: టెస్టు క్రికెట్‌కు అంబాసిడర్ టీమ్ఇండియానే: రవిశాస్త్రి
Social Look: శ్రద్ధాదాస్ ‘రిపీట్ మోడ్’.. లాంగ్ హెయిర్ మిస్సైన ప్రణీత!
Offbeat: పాముల కోసం పెట్టిన పొగ.. ₹13 కోట్ల ఇంటిని కాల్చేసింది..!
Eatala Jamuna: కలెక్టర్ ఆరోపణలన్నీ అసత్యం.. మాకున్నది 8.36 ఎకరాలే: ఈటల జమున
Microsoft Teams: ప్రొఫైల్ కార్డులో కొత్త ఫీచర్..షేర్, హైడ్ చాట్.. ఇంకా
Delhi Airport: ఒమిక్రాన్ కట్టడికా? ఆహ్వానానికా?.. రైల్వేస్టేషన్‌ను తలపించిన దిల్లీ ఎయిర్‌పోర్టు
Omicron: ఒక్కడోసూ తీసుకోనివారికే ముప్పు: సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ వినయ్‌కుమార్
Ap News: ఓటీఎస్ నచ్చితేనే ఇల్లు రిజిస్ట్రేషన్: బొత్స సత్యనారాయణ
IND vs SA: టీమ్ఇండియా.. దక్షిణాఫ్రికా పర్యటన తాజా షెడ్యూలిదే.!
Off beat: వివాహ విందులో ఆహారం మిగిలిందని.. ఆ మహిళ ఏం చేసిందో తెలుసా..?
Punjab Polls: పంజాబ్‌లో గెలుపే లక్ష్యం.. ఆ 2 పార్టీలతో సర్దుబాటు: కెప్టెన్
Nagaland: ఆ చట్టాన్ని రద్దు చేయాల్సిందే.. ఈశాన్యరాష్ట్రాల సీఎంల డిమాండ్
IND vs NZ: న్యూజిలాండ్‌పై జైత్రయాత్ర.. టీమ్ఇండియా అదిరిపోయే రికార్డులు..!
Road Accident: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి దుర్మరణం
Ap News: ఓటీఎస్‌తో పేదలకు ఎలాంటి నష్టం ఉండదు: సజ్జల రామకృష్ణారెడ్డి