తాజా వార్తలు

Facebook Share Twitter Share Comments Telegram Share
IND vs SA: దక్షిణాఫ్రికా టూర్‌కి అశ్విన్‌ను తప్పించాల్సి వస్తే.. ద్రవిడ్‌ అలా చేయాల్సిందే! : సబా కరీమ్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: త్వరలో ప్రారంభం కానున్న దక్షిణాఫ్రికా పర్యటనకు టీమ్‌ఇండియా సీనియర్‌ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను తప్పించాల్సి వస్తే.. జట్టు అవసరాలేంటో, అనుసరించాల్సిన ప్రణాళికలేంటో కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్ స్పష్టంగా వివరించి అతడికి నచ్చచెప్పగలడని మాజీ క్రికెటర్‌ సబా కరీమ్‌ అన్నాడు. ‘అశ్విన్‌ గొప్ప బౌలర్‌. అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఇటీవల న్యూజిలాండ్‌తో ముగిసిన టెస్టు సిరీస్‌లో గొప్పగా రాణించాడు. అందుకే, దక్షిణాఫ్రికా పర్యటనకు అతడిని పక్కన పెట్టడం చాలా కష్టమైన పని. తప్పనిసరి పరిస్థితుల్లో తప్పించాల్సి వస్తే ప్రస్తుత టీమ్‌ఇండియా కోచ్‌ రాహుల్ ద్రవిడ్‌.. తన ప్రణాళికలను, జట్టు అవసరాలను అతడికి స్పష్టంగా వివరించి నచ్చజెప్పగలడనే నమ్మకం ఉంది’ అని సబా కరీమ్ పేర్కొన్నాడు. 

‘సాధారణంగా ఐదుగురు బౌలర్ల (4 పేసర్లు + 1 స్పిన్నర్‌)తో టీమ్ఇండియా విదేశీ పర్యటనలకు వెళ్తుంటుంది. ఆరుగురు పూర్తి స్థాయి బ్యాటర్లు సహా.. ఏడో స్థానంలో రాణించగల నాణ్యమైన ఆల్‌ రౌండర్‌ని తుది జట్టులోకి తీసుకుంటుంది. అందుకే విదేశీ పర్యటనలకు ఆల్ రౌండర్‌ రవీంద్ర జడేజాకు జట్టు యాజమాన్యం అధిక ప్రాధాన్యం ఇస్తుంటుంది. అయితే, కీలక సమయాల్లో వికెట్లు పడగొట్టగల మెరుగైన బౌలర్ అవసరం కూడా జట్టుకు చాలా ఉంది. అందుకోసమైన దక్షిణాఫ్రికా పర్యటనలో అశ్విన్‌ను తుది జట్టులోకి తీసుకుంటారనుకుంటున్నాను’ అని సబా కరీమ్‌ అన్నాడు. టీమ్‌ఇండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య డిసెంబరు 26 నుంచి తొలి టెస్టు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.

Read latest Sports News and Telugu News


మరిన్ని

దేవ‌తార్చ‌న

+

© 1999- 2022 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.