తాజా వార్తలు

Facebook Share Twitter Share Comments Telegram Share
TMC leader: ప్రభుత్వ కార్యాలయంలో తుపాకీతో టీఎంసీ మహిళా నేత.. 

కోల్‌కతా: ప్రభుత్వ కార్యాలయంలో చేతిలో తుపాకీతో తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ (టీఎంసీ) మహిళా నేత దర్శనమిచ్చిన ఓ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీనిపై భాజపా స్పందిస్తూ.. టీఎంసీ హింసాత్మక సంస్కృతిని ప్రోత్సహిస్తోందని విమర్శలు గుప్పించింది. సదరు ఫొటోపై టీఎంసీ సైతం ఆగ్రహించింది. ఆ తుపాకీ నిజమైందో? లేక డమ్మీదో నిర్ధారించాలని పేర్కొంది.

పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లా పాత మాల్దా పంచాయతీ సమితి అధ్యక్షురాలు, టీఎంసీ మహిళా మండలి అధ్యక్షురాలు మృణాళిని మండల్‌ మైతీ.. ఓ ప్రభుత్వ కార్యాలయంలోని కుర్చీలో చేతిలో తుపాకీతో దర్జాగా కూర్చున్న ఓ ఫొటో సోషల్‌ మీడియాలో వైరలయ్యింది. కాగా దీనిపై భాజపా విమర్శలు గుప్పించింది. ‘ఇదీ టీఎంసీ సంస్కృతి. దీనిపై విచారణ జరిపితే పిస్తోళ్లే కాదు.. వారి నేతల వద్ద ఏకే-47 లాంటి ఆయుధాలు, బాంబులు లభించొచ్చు. ఈ ఫొటోను మమతా బెనర్జీ సైతం చూసుండొచ్చు కానీ ఆమె ఎలాంటి చర్యలు తీసుకోరు’ అని భాజపా జిల్లా అధ్యక్షుడు గోబిందా చంద్ర మండల్‌ ఆరోపించారు.

కాగా ఆ ఫొటోపై తృణమూల్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణేందు నారాయణ్ చౌదరి స్పందించారు. ఇది నిజమైన తుపాకీ అని తాను భావిస్తున్నానని, అయితే ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేయాలని పేర్కొన్నారు. ఇది నేతల ఇమేజ్‌ను డ్యామేజ్‌ చేసేలా ఉందని వ్యాఖ్యానించారు. కాగా ఈ ఫొటోపై ఇప్పటివరకు  మృణాళిని మండల్‌ స్పందించలేదు. గతంలో పలు వివాదాల్లో ఆమె కేంద్రబిందువుగా ఉన్నారు. ప్రభుత్వాధికారులపై దాడులు సహా.. ఆమె భర్తపై పలు ఆరోపణలు ఉన్నాయి.

 

Read latest National - International News and Telugu News

 


మరిన్ని

దేవ‌తార్చ‌న

+

© 1999- 2022 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.