క్రీడలు

Facebook Share Twitter Share Comments Telegram Share
యాషెస్‌ తొలి టెస్టుకు అండర్సన్‌ దూరం

బ్రిస్బేన్‌: ఆస్ట్రేలియాతో ప్రతిష్ఠాత్మక యాషెస్‌ సిరీస్‌ తొలి మ్యాచ్‌ ముంగిట ఇంగ్లాండ్‌ ఆశ్చర్యకర నిర్ణయం తీసుకుంది. బుధవారం ఆరంభమయ్యే ఈ మ్యాచ్‌లో తమ ప్రధాన పేసర్‌ జేమ్స్‌ అండర్సన్‌ను ఆడించట్లేదు. రొటేషన్‌లో భాగంగా అండర్సన్‌కు విశ్రాంతినివ్వాలని ఇంగ్లాండ్‌ జట్టు యాజమాన్యం నిర్ణయించింది. అడిలైడ్‌లో జరిగే గులాబి టెస్టుకు అండర్సన్‌ను తాజాగా ఉంచేందుకే ఈ నిర్ణయమట. ‘‘అండర్సన్‌ ఫిట్‌గానే ఉన్నాడు. అతడికేమీ గాయం కాలేదు. ఆరు వారాల్లో అయిదు టెస్టులు ఆడాల్సి ఉన్న నేపథ్యంలో అతడిని తొలి టెస్టుకు దూరం పెట్టాం’’ అని ఇంగ్లాండ్‌ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. తొలి టెస్టు బుధవారం ఉదయం 5.30కి ఆరంభమవుతుంది.


మరిన్ని

దేవ‌తార్చ‌న

+

© 1999- 2022 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.