
క్రీడలు
దిల్లీ: టీమ్ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య విజయ్ హజారె ట్రోఫీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. పూర్తిస్థాయి బౌలింగ్ ఫిట్నెస్ సాధించడం కోసమే హార్దిక్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ‘‘విజయ్ హజారె ట్రోఫీకి అందుబాటులో ఉండగలవా అంటూ హార్దిక్‌కు బరోడా క్రికెట్ సంఘం (బీసీఏ) ఇమెయిల్ పంపింది. గత మూడేళ్లలో బరోడా తరపున అతను చాలా అరుదుగా ఆడాడు. అయితే ప్రస్తుతం తాను ముంబయిలో ఫిట్నెస్ శిబిరంలో ఉన్నట్లు ఒకేఒక్క లైన్లో అతను బదులిచ్చాడు. హార్దిక్‌కు ఎలాంటి గాయమైందో బీసీఏకు కూడా తెలియదు’’ అని బీసీఏ అధికారి తెలిపాడు.