
క్రీడలు
ఢాకా: పాకిస్థాన్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆతిథ్య బంగ్లాదేశ్‌కు ఫాలోఆన్ గండం పొంచిఉంది. ఆఫ్ స్పిన్నర్ సాజిద్‌ఖాన్ (6/35) తన కెరీర్లోనే అత్యుత్తమ గణాంకాలు నమోదు చేయడంతో బంగ్లా బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. మంగళవారం ఆట నిలిచే సమయానికి బంగ్లా తొలి ఇన్నింగ్స్‌లో 26 ఓవర్లలో ఏడు వికెట్లకు 76 పరుగులు చేసింది. బుధవారం మ్యాచ్‌కు చివరి రోజు కాగా.. బంగ్లా 224 పరుగులు వెనుకబడి ఉంది. ఫాలోఆన్ గండం నుంచి తప్పించుకోవాలంటే ఆతిథ్య జట్టు మరో 25 పరుగులు చేయాలి. షకిబ్ (23 బ్యాటింగ్), తైజుల్ ఇస్లాం (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 188/2తో ఆట కొనసాగించిన పాక్ 98.3 ఓవర్లలో 300/4 స్కోరు వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.