Latest Telugu News | Breaking News Telugu | Telugu News Today | News in Telugu

క్రీడలు

Facebook Share Twitter Share Comments Telegram Share
ఫైనల్లో భారత్‌-డి

విజయవాడ: ఒక్క ఓటమి లేకుండా భారత్‌-డి జట్టు మహిళల ఛాలెంజర్‌ ట్రోఫీలో ఫైనల్‌ చేరింది. మంగళవారం జరిగిన చివరి లీగ్‌ మ్యాచ్‌లో ఆ జట్టు 22 పరుగుల తేడాతో భారత్‌-ఏను ఓడించింది. మొదట భారత్‌-డి 7 వికెట్లకు 219 పరుగులు చేసింది. పూజ వస్త్రాకర్‌ (96) కొద్దిలో సెంచరీ కోల్పోయింది. దివ్య (33), ఆయూషి (47) రాణించారు. ఛేదనలో భారత్‌-ఏ 50 ఓవర్లలో 7 వికెట్లకు 197 పరుగులే చేయగలిగింది. కసత్‌ (51) టాప్‌ స్కోరర్‌. కనిక, సైకా రెండేసి వికెట్లు తీయగా.. రాజేశ్వరీ, పూజ ఒక్కో వికెట్‌ పడగొట్టారు. దీంతో నాలుగు జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో గెలిచిన భారత్‌-డి ఫైనల్‌కు దూసుకెళ్లగా.. భారత్‌-బి, భారత్‌-సి జట్ల కన్నా మెరుగైన రన్‌రేట్‌ ఉన్న భారత్‌-ఏ టైటిల్‌ సమరానికి అర్హత సాధించింది. డిసెంబర్‌ 9న ఫైనల్‌ జరగనుంది.


మరిన్ని

+

© 1999- 2022 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.