
గ్రేటర్ హైదరాబాద్
భాజపాలో తీన్మార్ మల్లన్న చేరిక సందర్భంగా తరుణ్‌ఛుగ్
తరుణ్ ఛుగ్, సంజయ్‌ల నుంచి భాజపా సభ్యత్వం స్వీకరిస్తున్న తీన్మార్ మల్లన్న
ఈనాడు, దిల్లీ: ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో అవినీతిని బట్టబయలు చేసే క్రమంలో లాఠీదెబ్బలు, జైళ్లకు వెళ్లేందుకు కార్యకర్తలు సిద్ధపడాలని భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్ ఛుగ్ అన్నారు. దిల్లీలోని భాజపా కేంద్ర కార్యాలయంలో తరుణ్ ఛుగ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ల సమక్షంలో చింతపండు నవీన్‌కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న మంగళవారం భాజపాలో చేరారు. ఈ సందర్భంగా ఛుగ్ మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్లన్నకు లక్షకు పైగా ఓట్లు రావడంతో జీర్ణించుకోలేక ఆయనపై అక్రమ కేసులు పెట్టారని విమర్శించారు. కార్యక్రమంలో ఎంపీ అర్వింద్, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.