
ఆంధ్రప్రదేశ్
సీఎం సహాయనిధికి రూ.కోటి విరాళం
ఈనాడు, హైదరాబాద్: నటనలోనే కాదు... చేయూత అందించడంలోనూ తాను బాహుబలే అని మరోసారి నిరూపించారు అగ్ర కథానాయకుడు ప్రభాస్. విపత్తుల, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఆయన ఆపన్నహస్తం అందిస్తూ పెద్ద మనసుని చాటుతుంటారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ వరద బాధితుల సహాయార్థం ప్రభాస్ రూ.కోటి విరాళం ప్రకటించారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్లో కురిసిన భారీ వర్షాలతో వరదలు ముంచెత్తిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు కథానాయకులు విరాళాలు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఈ విరాళం అందజేయనున్నట్టు మంగళవారం ప్రభాస్ ఓ ప్రకటనలో తెలిపారు.